విభిన్న కథలతో వచ్చే దర్శకులకు మన కుర్ర హీరోలు వేగంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంటారు. ఆ తరహాలో ఇప్పుడిపుడే అడుగులు వేస్తున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. నేడు అంతరిక్షం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ గ్రాండ్ గా రిలీజ్ చేసింది. అయితే సినిమాకు సంబందించిన విషయాలను కొన్నిటిని వరుణ్ వివరించాడు. 

మొదట ఏదైనా డిఫరెంట్ కథ చేయాలనీ అనుకున్నప్పుడు అంతరిక్షం లాంటి డిఫరెంట్ జానర్ ని టచ్ చేస్తానని అందుకోలేదని అయితే ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం చరణ్ అన్న అంటూ తెలిపారు. సంకల్ప్ కథ చెప్పగానే బావుందని ఒప్పుకున్నాను కానీ కథకు ఎంతవరకు న్యాయం చేయగలను అని ఒక ఆలోచన వచ్చినప్పుడు చరణ్ అన్నని అడిగితే ఆయన ఒకే ఒక్క మాట అన్నారు. 

నువ్ ఎంచుకున్న కథ అలాగే చిత్ర దర్శకుడు అంతా కరెక్ట్ గా ఉందని సినిమా తప్పకుండా బావుంటుందని తనకు ధైర్యాన్ని ఇచ్చాడని వరుణ్ తేజ్ వివరణ మాట్లాడారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ - మెగాస్టార్ చిరంజీవి గారు తన వెనుకే ఉన్నారని రామ్ చరణ్ ని చూపిస్తూ తప్పకుండా సినిమా అందరికి నచ్చుతుందని మెగా అభిమానులు గర్వపడేలా సినిమా ఉంటుందని వరుణ్ మాట్లాడారు.