మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ 'వాల్మీకి' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా తమిళ 'జిగర్తండా'కి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. 

ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో సినిమా మొదలైంది. అయితే ఈ సినిమా టైటిల్ పై వివాదం చెలరేగింది. గ్యాంగ్ స్టర్ సినిమాకు 'వాల్మీకి' అనే పేరు ఎలా పెడతారంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు.

ఆ తరువాత గొడవ సద్దుమణిగింది. అయితే ఈ సినిమాపై తరువాత పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. దీంతో ఇప్పుడు సినిమాపై హైప్ తీసుకురావడానికి ప్రీటీజర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రంజాన్ పండుగ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన చేశారు. ''ఈ పవిత్రమైన రోజున టీమ్ తరువాత ఈ ప్రకటన చేయడం సంతోషంగా ఉంది. ప్రీటీజర్ తో అతి త్వరలోనే మీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం'' అని ట్వీట్ చేశారు.