మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టాలీవుడ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుని దూసుకుపోతున్నాడు. వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రాలు వైవిధ్యభరితంగా ఉంటున్నాయనే ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రస్తుతం వరుణ్ వాల్మీకి చిత్రంలో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. 

వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటాడు. తాజాగా వరుణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసిన ఓ ఫోటో నెటిజన్లని ఫిదా చేస్తోంది.తన తండ్రి నాగబాబు, పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కలసి ఉన్న ఫోటోని వరుణ్ అభిమానులతో పంచుకున్నాడు. ఇది వరుణ్ తేజ్ చిన్ననాటి ఫోటో. పాలబుగ్గల పిల్లాడిలా కనిపిస్తున్న వరుణ్ పవన్ కళ్యాణ్ భుజాలపై ఎక్కి కనిపిస్తున్నాడు. 

పవన్ కళ్యాణ్ కు చెరోవైపు నాగబాబు, చిరంజీవి ఉన్నారు. నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తులతో ఉన్నా.. వారిని ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా అని కామెంట్ పెట్టాడు.ఈ ఫొటోలో నాగబాబు గడ్డంతో రఫ్ లుక్ లో ఉండగా చిరు హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్నాడు. 

ఏప్రిల్ లో ముగిసిన ఏపీ ఎన్నికల సందర్భంగా వరుణ్ తేజ్ కూడా జనసేన పార్టీ తరుపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రి నాగబాబు పోటీ చేసిన నరసాపురం నియోజకవర్గంలో వరుణ్ ప్రచారం నిర్వహించాడు. వరుణ్ ప్రస్తుతం నటిస్తున్న వాల్మీకి చిత్రం జిగర్తాండ అనే తమిళ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది.