మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ విభిన్నమైన చిత్రాలతో నటుడిగా రాణిస్తున్నాడు. వరుణ్ ప్రయోగాత్మక చిత్రాల్లో నటించేందుకు కూడా వెనకాడడం లేదు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ లో వరుణ్ తేజ్ లుక్ ఆకట్టుకుంది. మాస్ ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలతో హరీష్ ఈ చిత్రాన్ని రూపొందించారు. 

సెప్టెంబర్ 20న వాల్మీకి చిత్రం విడుదల కానుండడంతో ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్ని చేపడుతోంది. టీజర్, ట్రైలర్స్ కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా చిత్ర యూనిట్ వాల్మీకి చిత్రంలోని పాటని విడుదల చేశారు. వరుణ్ తేజ్ క్యారెక్టర్ ని వివరించేలా ఉన్న ఈ ప్[పాట మాస్ బీట్ తో ఆకట్టుకుంటోంది. 

దడ దడ దడ దంచుడే.. గుండెల్లోకి పిడి దింపుడే అంటూ చంద్రబోస్ రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. సింగర్ అనురాగ్ కులకర్ణి మంచి జోష్ తో ఈ పాటని పాడారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.