తమన్ సంగీతంలో రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ అంచనాలను మూవీ అందుకోవడంలో విఫలమయ్యింది. దాంతో బాక్సాఫీస్ వద్ద ‘గని’ కి ఆశించిన స్థాయిలో కలెక్షన్లు నమోదు కాలేదు.
వరుణ్ తేజ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిన చిత్రం ‘గని’. అల్లు అరవింద్ సమర్పణలో ‘రెనైజెన్స్ పిక్చర్స్’ ‘అల్లు బాబీ కంపెనీ’ బ్యానర్లపై సిద్దు ముద్ద, అల్లు బాబీ లు కలిసి వరుణ్ తేజ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు.వరుణ్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడి సిక్స్ ప్యాక్ బాడీని డెవలప్ చేసాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది.
తమన్ సంగీతంలో రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ అంచనాలను మూవీ అందుకోవడంలో విఫలమయ్యింది. దాంతో బాక్సాఫీస్ వద్ద ‘గని’ కి ఆశించిన స్థాయిలో కలెక్షన్లు నమోదు కాలేదు. రేపటి నుంచి బీస్ట్, కేజీఎఫ్ 2 చిత్రాలు వచ్చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో వరుణ్ తేజ్ ఈ చిత్రం రిజల్ట్ పై సోషల్ మీడియా వేదికపై స్పందించారు.
“ఇన్ని సంవత్సరాలుగా మీరు నాపై కురిపించిన ప్రేమ మరియు ఆప్యాయతలను నేను చాలా వినయంగా స్పీకరిస్తున్నాను. గనీ మేకింగ్‌లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు మీ హృదయాన్ని మరియు ఆత్మను ఉంచారు , ముఖ్యంగా నేను నా నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేము మీకు మంచి చిత్రాన్ని అందించడానికి కష్టపడి పనిచేశాము . మేము అనుకున్నట్లుగా ప్రాజెక్ట్ రాలేదు. నేను సినిమాకు పని చేసిన ప్రతిసారీ, నా ఉద్దేశ్యం మిమ్మల్ని అలరించడమే. కొన్నిసార్లు నేను విజయం సాధిస్తాను మరియు కొన్నిసార్లు నేను నేర్చుకుంటాను, కానీ నేను కష్టపడి పనిచేయడం ఎప్పటికీ ఆపను అంటూ ఎమోషనల్ గా ఆయన రాసుకొచ్చారు.
ఇక 'గని' విషయానికి వస్తే... కొత్తదనం ఏమీ లేదు. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ అసలు ఆకట్టుకోదు. సినిమా నుంచి ఆ ట్రాక్ తీసేసినా... పెద్దగా నష్టం అనిపించదు. ఇంటర్వెల్‌లో 'గేమ్ బిగిన్స్' అని వేశారు. నిజానికి, 'గని' అసలు కథ కూడా ఇంటర్వెల్ దగ్గర మొదలైంది. అలాగని, సెకండాఫ్‌లో కూడా కొత్తదనం ఏమీ లేదు. ప్రేక్షకుల ఊహలకు అనుగుణంగా ఉంటుంది. కాకపోతే... ఫస్టాఫ్‌తో పోలిస్తే బెటర్. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా తన తొలి సినిమాకు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా రొటీన్ ఫార్ములా కథ రాసుకున్నాడు.
