డీజే సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు హరీష్ శంకర్ నెక్స్ట్ వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో దర్శకుడు హరీష్ ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటైన శోభన్ బాబు సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. 

శోభన్ బాబు - శ్రీదేవి జంటగా నటించిన దేవత(1992) సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా సినిమాలో 'ఎల్లువేత్తి గోదారమ్మా' అనే పాట ఆల్ టైమ్ బెస్ట్ క్లాసిక్స్ లో ఒకటి. అయితే ఆ సాంగ్ ని ప్రస్తుత స్టైల్ కి తగ్గట్టు బీట్స్ తో చేంజెస్ చేసి వాల్మీకి సినిమాలో వాడనున్నారట. మ్యూజిక్ డైరక్టర్ మిక్కీ జె మేయర్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 

గతంలో దర్శకుడు హరీష్ శంకర్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో మెగాస్టార్ 'గువ్వా గోరింకతో' సాంగ్ ని రీమిక్స్ చేసి మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఎల్లువెత్తి గోదారమ్మ సాంగ్ పై మనసు పడ్డ హరీష్ ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.