వరుణ్ తేజ్ రియల్ ఇన్సిడెంట్స్ తో సినిమా చేస్తున్నారు. తాజాగా ఆ విషయాన్ని ప్రకటించారు. ఆయన ట్వీట్ వైరల్ అవుతుంది.
వరుణ్ తేజ్ ఇటీవల `ఎఫ్3`తో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తార్ సినిమాలో నటిస్తున్నారు. ఇది వరుణ్ తేజ్‌కి 12వ మూవీ. తాజాగా మరో సినిమాకి కమిట్ అయ్యాడు వరుణ్ తేజ్. ఈ సినిమాని వివరాలు పంచుకుంటూ ఓ వీడియోని విడుదల చేశారు. తన 13వ మూవీకి కమిట్ అయినట్టుగా తెలిపారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్టు తెలిపారు.
బౌండెడ్ స్క్రిప్ట్ ని చదివి సాటిస్ఫై అయిన వరుణ్ తేజ్ ఈ సినిమాని ఓకే చేసినట్టుగా ఈ వీడియోలో ఉంది. ఇక దీనికి దర్శకుడెవరు, ప్రొడక్షన్ ఎవరు వంటి ఇతర అంశాలతో అధికారిక ప్రకటన మరో రెండు రోజుల్లో తెలియజేయనున్నారట. ఈ నెల 19న అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్టు ఈ వీడియోలో తెలిపారు వరుణ్ తేజ్. `ఆకాశాన్ని తాకే ఇండియా గ్లోరీ` అనే అర్థంలో వరుణ్ తేజ్ ఈ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.
వరుణ్ తేజ్ `ఎఫ్3`తో మెప్పించారు. వెంకటేష్‌తో కలిసి నటించిన `ఎఫ్3` కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. అంతకు ముందు `గని` చిత్రంతో డిజప్పాయింట్‌ని చవి చూశారు. సోలో హిట్ కోసం ప్రయత్నిస్తున్నారు వరుణ్ తేజ్. ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా చేస్తున్నారు. అనంతరం కొత్త సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉంది.
