Asianet News TeluguAsianet News Telugu

ఇంత స్పీడా.. కొత్త పెళ్లి కొడుకు వరుణ్ తేజ్ జోరు చూశారా.. ఒక పనైపోయింది

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పీడు మాములుగా లేదు. కొత్త పెళ్లి కొడుకు వరుణ్ తేజ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. రిజల్ట్స్ తో సంబంధం లేకుండా వరుణ్ తేజ్ సినిమాలు చకచకా పూర్తి చేసేస్తున్నాడు.

Varun Tej next movie Operation Valentine shoot wraps up dtr
Author
First Published Oct 19, 2023, 8:32 PM IST | Last Updated Oct 19, 2023, 8:32 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పీడు మాములుగా లేదు. కొత్త పెళ్లి కొడుకు వరుణ్ తేజ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. రిజల్ట్స్ తో సంబంధం లేకుండా వరుణ్ తేజ్ సినిమాలు చకచకా పూర్తి చేసేస్తున్నాడు. వరుణ్ చివరగా గాండీవధారి అర్జున చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ మట్కా, ఆపరేషన్ వాలంటైన్ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. సర్ప్రైజింగ్ గా ఆపరేషన్ వాలంటైన్ చిత్ర షూటింగ్ పూర్తయినట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. 

ఈ మేరకు సోషల్ మీడియాలో మూవీ టీం మొత్తం ఉన్న ఫోటో షేర్ చేశారు. ఆపరేషన్ వాలంటైన్ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేసినట్లు ప్రకటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శక్తి ప్రతాప్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. 

వేగంగా ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరచిపోలేని అధ్యాయం ఇది. డిసెంబర్ 8న వస్తున్నాం అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేసాడు. ఇదిలా ఉండగా కొత్త పెళ్లి కొడుకు వరుణ్ తన వివాహానికి ముందు ఒక పని ఫినిష్ చేశాడు. నవంబర్ 1న ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వరుణ్ బ్యాచిలర్ పార్టీ లతో కూడా సందడి చేశాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios