వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం బాక్సింగ్‌ నేపథ్యంలో `గని` చిత్రంలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. జులై 30న దీన్ని విడుదల చేయబోతున్నట్టు తెలిపింది చిత్ర బృందం. గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. 

ఇప్పుడు వరుసగా సినిమా విడుదల అప్‌డేట్‌లు ప్రకటిస్తున్నారు. రాజమౌళి `ఆర్‌ ఆర్‌ ఆర్‌` విడుదల తేదీని ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. దీంతో మిగిలిన సినిమాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్‌ తాను నటిస్తున్న `పుష్ప` చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 13న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పుడు వరుణ్‌ తేజ్‌ కూడా తమ సినిమా డేట్‌ని ప్రకటించారు. 

మరోవైపు గోపీచంద్‌ సైతం తన సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందుతున్న `సీటీమార్‌` చిత్రాన్ని ఏప్రిల్‌ 2న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. మహిళా కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న `లవ్‌ స్టోరి` చిత్రాన్ని ఏప్రిల్‌ 16న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. 

ఇదే కాదు వరుసగా చిరంజీవి `ఆచార్య` చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. అలాగే ప్రభాస్‌ నటిస్తున్న `రాధేశ్యామ్‌`ని ఏప్రిల్‌లో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు.