సారాంశం

హీరో వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి పెళ్లికి సంబంధించిన డేట్‌ ఫిక్స్ అయ్యింది. అలాగే డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కి సంబంధించిన వేదిక కూడా ఫైనల్‌ అయ్యిందట. 

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. గతంలోనే ఈ ఇద్దరికి ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. ఇప్పుడు మ్యారేజ్‌ డేట్‌ ఫిక్స్ చేశారట. నవంబర్‌ 1న గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారట. డెస్టినీ వెడ్డింగ్‌కి వేదిక కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇటలీలో అంగరంగ వైభవంగా ప్లాన్‌ చేశారట.  ఇటలీలోని టుస్కానీ లో గల బోర్గో శాన్ ఫెలోస్ రిసార్ట్ వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిల వెడ్డింగ్‌ వేదికగా నిర్ణయించినట్టు సమాచారం. 

హీరో వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిలు ఈ ఏడాది జూన్‌ 9న హైదరాబాద్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, అత్యంత దగ్గరి సన్నిహితులు, సినీ సెలబ్రిటీలు వీరి ఎంగేజ్‌మెంట్‌కి హాజరయ్యారు. ఇక పెళ్లి మాత్రం చాలా గ్రాండ్‌గా, డెస్టినీ మ్యారేజ్‌ చేసుకునేందుకు ఈ జంట సిద్ధమవుతుందట. ఈ మ్యారేజ్‌కి సంబంధించిన షాపింగ్‌ కూడా ఇప్పటికే ప్రారంభించారు. ఇక పెళ్లికి మెగా ఫ్యామిలీతోపాటు కొద్ది మంది సినీ సెలబ్రిటీలు, బంధు మిత్రులు పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం హైదరాబాద్‌లో భారీగా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారని టాక్.

వరుణ్‌ తేజ్‌, లావణ్య.. కలిసి `మిస్టర్‌` చిత్రంలో నటించారు. ఈ సినిమా సమయంలోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడిందట. అది రాను రాను బలంగా మారిందని, ఆ తర్వాత `అంతరిక్షం` చిత్రంలోనూ ఈ ఇద్దరు కలిసి నటించడంతో ప్రేమ మరింత బలపడిందని తెలుస్తుంది. దీంతో ఈ ఇద్దరు రియల్‌ లైఫ్‌లో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అయితే మొదట్లో మెగా ఫ్యామిలీ నుంచి అభ్యంతరం వచ్చినా, లావణ్య వరుణ్‌ని వదల్లేదని, దీంతో పెళ్లికి సిద్ధమయ్యారని టాక్‌.