పెళ్లి, హనీమూన్ అంతా అయిపోయింది. ఇక వర్క్ మోడ్ లోకి వెళ్ళబోతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. షూటింగ్స్ కు రెడీ అవుతున్నాడు. వచ్చీ రాగానే వరుణ్ షూటింగ్ లో జాయిన్ అయ్యేలా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.  


రీసెంట్ గా పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడు అయ్యాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య మెడలో మూడు ముళ్ళు వేసి.. మెగా కోడలిగా తీసుకువచ్చాడు. నవంబర్ 1న వీరి పెళ్ళి ఇటలీలో చాలా ఘనంగా జరిగింది. ఇక ఆతరువాత ఇద్దరు హనీమూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ ఇక షూటింగ్స్ షురు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వరుస ఫేయిల్యూర్స్ తో ఇబ్బందిపడుతున్నయంగ్ హీరో.. ఇక ఈసారి సాలిడ్ హిట్ కొట్టాలనిప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగానే రెండు డిఫరెంట్ సినిమాలను సెట్స్ పైకి ఎక్కించాడు వరుణ్ తేజ్. 

ఈక్రమంలో వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ ఎక్కించారు. మిషన్ వాలెంటైన్ తో పాటు మట్కా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఆయన ముందుగా మట్కా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుతెలుస్తోంది. వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న సినిమాల్లో పాన్ ఇండియా సినిమాగా మట్కా రూపొందుతోంది. పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. మట్కా సినిమాను భారీ బడ్జెట్ తో వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. 

ఇక వరుణ్ తేజ్ తేజ్ కు సబంధించిన కీలక సన్నివేశాలు తెరకెకించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారట. అందుకోసం హైదరాబాద్‌ సరిహద్దుల్లో స్పెషల్ సెట్‌ వేసినట్టు తెలియజేస్తూ.. అప్‌డేట్ అందించారు మేకర్స్‌. ఈసినిమా డైరెక్టర్‌ మానిటర్‌లో సీన్ చెక్ చేసుకుంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్టిల్‌తో షేర్ చేసిన మట్కా షూటింగ్ నయా అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 

Scroll to load tweet…

ఈ సినిమా భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. కథ ప్రకారం చూస్తే.. ఈ మూవీలో వరుణ్ తేజ్‌ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడట. ఇక మట్కాలో నోరాఫతేహి కూడా సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాతో పాటు వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీలో కూడా నటిస్తున్నాడు. మరి ఈసారైనా హిట్టు కొడతాడా లేదా చూడాలి. హిట్టు కొట్టాలన్న పట్టుదలతో మాత్రం ఉన్నాడు మెగా ప్రిన్స్.