స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్ మూవీగా తెరకెక్కిన ‘గాంఢీవధారి అర్జున’ సినిమా రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. 

కెరీర్ లో విభిన్నమైన సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్న వరణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. ఈ సినిమాకు టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. తాజాగా మూవీ నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ టీజర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్ మూవీగా తెరకెక్కిన ‘గాంఢీవధారి అర్జున’ సినిమా రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. 

ప్రస్తుతం వరుణ్‌తేజ్ ఆశలన్ని గాంఢీవధారి అర్జున పైనే ఉన్నాయి. ప్రవీణ్ స‌త్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, మేకింగ్‌ వీడియోలు సినిమాపై తిరుగులేని హైప్‌ను క్రియేట్‌ చేశాయి. అలాగే వ‌రుణ్ తేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ‌డ్జెట్ మూవీగా రూపొందుతోన్న ‘గాంఢీవధారి అర్జున’ చిత్రంలో యాక్ష‌న్ సీక్వెన్సెస్ టెక్నిక‌ల్ హై స్టాండ‌ర్డ్స్‌తో మెప్పించనున్నాయి.

Scroll to load tweet…

 ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై సీనియర్ నిర్మాత బి.వి.ఎస్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన మిక్కి జె.మేయ‌ర్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా, ముఖేష్ సినిమాటోగ్ర‌ఫీ, అవినాష్ కొల్ల ఆర్ట్ వ‌ర్క్‌ను అందిస్తున్నారు. ‘గాంఢీవధారి అర్జున’ చిత్రం ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున విడుద‌ల‌వుతుంది. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. సహా నిర్మాతగా నాగబాబు వ్యవహరిస్తున్నాడు. మిక్కీ జే మెయర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటించింది.