వరుణ్ తేజ్ `గాంఢీవధారి అర్జున` రిలీజ్ డేట్..
మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్ పెళ్లి టాపిక్ గత కొన్ని రోజులుగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన తన సినిమా అప్‌డేట్‌ని ఇచ్చారు. కొత్త సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.

వరుణ్ తేజ్ చివరగా `గని` సినిమాతో పరాజయాన్ని చవి చూశారు. `ఎఫ్3`తో ఫర్వాలేదనిపించుకున్నారు. లావణ్య త్రిపాఠితో లవ్ స్టోరీల విషయంలో బాగా వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాదు త్వరలో ఎంగేజ్‌మెంట్ అంటూ, పెళ్లికి సిద్ధమయ్యారు అనే రూమర్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ సైతం మీడియాకి, సోషల్ మీడియాకి హాట్ కేక్‌లా మారిపోయాయి. ఈ నేపథ్యంలో సినిమాల అప్‌డేట్లతో ఆ మ్యాటర్‌ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రాల్లో `గాంఢీవధారి అర్జున` ఒకటి.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ అదిరిపోయే అప్‌డేట్‌ని ఇచ్చింది యూనిట్. తాజాగా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ కొత్త లుక్‌ని విడుదల చేశారు. ఇందులో కోట్ ధరించి, చేతిలో గన్ పట్టుకుని స్టయిల్‌గా కనిపిస్తున్నారు వరుణ్ తేజ్. వెనకాల బాంబుల మోత మోగిపోతున్నట్టుగా బ్లాస్టింగ్‌లు కనిపిస్తున్నాయి. స్టయిలీష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సాగుతుందని సమాచారం.
ఈ సినిమా గురించి యూనిట్ చెబుతూ, `స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సులతో రూపొందుతోన్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్.. అందులో వరుణ్ తేజ్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్‌గా విడుదలైన బీటీఎస్ వీడియో గ్లింప్స్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. చిత్ర యూనిట్ విదేశాల్లో శరవేగంగా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ‘గాంఢీవధారి అర్జున’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 25 భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సినీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మరో వైపు నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేయటానికి టీమ్ చాలా కష్టపడుతోంది. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తాయి, టెక్నీకల్‌గానూ హై స్టాండర్డ్స్ లో ఉంటుంది` అని టీమ్ తెలిపింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మిక్కి జె.మేయర్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తుండగా, ముఖేష్ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్ల ఆర్ట్ వర్క్‌ను అందిస్తున్నారు.