మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ 'గాండీవధారి అర్జున' ఆగష్టు 25న రిలీజ్ కి రెడీ అవుతోంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ 'గాండీవధారి అర్జున' ఆగష్టు 25న రిలీజ్ కి రెడీ అవుతోంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చూస్తుంటే వరుణ్ తేజ్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ అండ్వెంచర్ చేయబోతున్నట్లు అనిపిస్తోంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. త్వరలో టీజర్ కూడా రిలీ చేయనున్నారు. టీజర్ రిలీజ్ కి ముందు చిన్న ప్రీ రీజర్ చూపించారు. ఈ ప్రీ టీజర్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యంలో ముంచెత్తేలా ఉంది. హాలీవుడ్ చిత్రాలని తలపించేలా హై వోల్టేజ్ యాక్షన్ తో వరుణ్ తేజ్ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
బైక్ ఛేజింగ్ లు , కారు ఛేజింగ్ లు, బిల్డింగ్ పై నుంచి దూకడాలు చూస్తుంటే ప్రవీణ్ సత్తారు యాక్షన్ ప్రియులు కోరుకునే పసందైన విందుని ఈ చిత్రంతో అందించబోతున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ అదరగొట్టేసినట్లు ఉన్నాడు. స్టైలిష్ గా సూట్ వరుణ్ కనిపిస్తున్న విధానం క్రేజీగా ఉంది. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. బిజియం అయితే సినిమాపై ఆసక్తిని పెంచేసేలా ఉంది.

ప్రవీణ్ సత్తారు కాంప్రమైజ్ కాకుండా టెక్నికల్ స్టాండర్డ్స్ ఒక రేంజ్ లో ఉండేటట్లు చూసుకున్నారు. కారులో వరుణ్ వేగంగా ప్రయాణించి.. ఆ తర్వాత గన్ లోడ్ చేసి స్టైలిష్ గా నడుస్తున్న విధానం ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో వరుణ్ స్పై గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. నాజర్, విమలా రామన్, రవి వర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
