ప్రతిసారి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఫైట్ లో మెగా హీరోలు ఎవరో ఒకరు చతికిల పడుతున్నారు. ఈ మధ్య కాలంలో మెగా హీరోల సక్సెస్ రేట్ చాలా వరకు తగ్గిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే యువ హీరో వరుణ్ తేజ్ మాత్రం అందుకు భిన్నంగా అడుగులు వేస్తున్నాడు. పోటీగా తనకంటే సీనియర్ హిరోలున్నా సక్సెస్ అందుకుంటున్నాడు. 

అదే విధంగా ఇతర మెగా హిరోలున్నా కూడా వరుణ్ తేజ్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంటున్నాడు. అసలు మ్యాటర్ లోకి వెళితే.. గత ఏడాదిలో సాయి ధరమ్ తేజ్ ఇంటిలిజెంట్ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కాగా వరుణ్ తేజ్ తొలిప్రేమ ఫిబ్రవరి 10న రిలీజ్ అయ్యింది. అప్పుడు వరుణ్ ఏ స్థాయిలో హిట్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

ఇక సాయి ధరమ్ తేజ్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాలతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా వినయవిధేయ రామ తో పోటీగా వరుణ్ F2 సినిమా రిలీజ్ అవ్వగా ఏది ఎక్కువ విజయాన్ని అందుకుందో తెలిసిందే. పక్కన మరో సీనియర్ హీరో బాలకృష్ణ సినిమా ఉన్నప్పటికీ ఆ రెండిటికి కంటే కూడా వరుణ్ సినిమానే ఎక్కువ కలెక్షన్స్ ను అందుకుంది. 

ఈ విధంగా వరుణ్ మెగా హీరోలైన బావ సాయి సినిమాను అలాగే అన్నయ్య సినిమాలతో పోటీపడి సైలెంట్ గా సక్సెస్ కొట్టేశాడు. ఇక నుంచి దీన్ని సెంటిమెంట్ గా తీసుకుంటే మెగా హీరోలు మెగా ఫైట్ నుంచి డ్రాప్ అవ్వడం పక్కా. సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ వైరల్ అయితే చెప్పేదేముంది.. సో మెగా హీరోలు వరుణ్ తో జాగ్రత్త అంటున్నారు నెటిజన్స్. F2 సినిమా ద్వారా వెంకటేష్ కూడా చాలా కాలం అనంతరం ఒక బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా 75 కోట్ల షేర్స్ వరకు కలెక్షన్స్ ను అందుకునే అవకాశం ఉంది.