మెగా ప్యాన్స్ ఫ్యీన్స్ కు గుడ్ న్యూస్.. మరో మల్టీ స్టారర్ మెగా అభిమానులను దిల్ ఖుష్ చేయబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వెల్లడించారు. ఇంతకీ ఎవరెవరు నటిస్తున్నారు. ఏంటీ సంగతి.  

మెగా ఫ్యామిలీలో హీరోలు ఎక్కువ.. మెగా ఫ్యాన్స్ కూడా ఎక్కువ. అందుకే మెగా ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేయడం కోసం ఏదో ఒక్క ప్రయత్నం చేస్తూనే ఉన్నారు హీరోలు. ఈక్రమంలో రీసెంట్ గా బ్రో సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాన్... సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలసి మల్టీ స్టారర్ మూవీతో అలరించారు. ఇక తాజాగా మరో మల్టీ స్టారర్ మెగా ఫ్యామిలీ నుంచి అలరించబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్ వెల్లడించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటేు..? 

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తాజా సినిమా గాడీవధారి అర్జున. యాక్షన్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ రూపోందిస్తున్న ఈసినిమా యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రాబోతుంది. ఈసినిమాను ఈ నెల 25న రిలీజ్ చేయడానికి సిద్దం చేస్తున్నారు. ఈక్రమంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ ను స్పీడప్ చేసింది. వరుసగా ఈవెంట్లు.. ఇంటర్వ్యూలతో హోరెత్తించబోతున్నారు టీమ్. ఇక ఇందులో భాగంగా.. వరుణ్ అండ్ మూవీ టీం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే వరుణ్ తేజ్ తన హీరోయిన్ సాక్షి, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో కలిసి తాజాగా ఓ ఇంటవ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో.. ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. 

ఇక ఈ ఇంటర్వ్యూలో గాండీవధారి అర్జునతో పాటు ఇతర ప్రాజెక్ట్స్ విషయాలు కూడా పంచుకున్నారు వరుణ్ తేజ్.అందులో భాగంగా మరో మెగామల్టీస్టారర్ మూవీ గురించి ఆయన ప్రస్తావించారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ కలిసి మల్టీస్టారర్ గా బ్రో మూవీ తీశారు. ఈసినిమాతో మెగా ఆడియన్స్ కు సూపర్ ట్రీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా ఇంకేమన్నా మెగా మల్టీస్టారర్ సినిమాలు వచ్చే ఛాన్స్ ఉందా? అని వరుణ్ ని ప్రశ్నించగా.. మంచి కథలు వస్తే తప్పకుండా చేస్తాము. చిరంజీవి గారు చరణ్ కలిసి కనపడ్డారు. ఆ తరువాత పవన్ బాబాయ్, తేజ్. అలా మల్టీస్టారర్ చేయాలనీ మాకు ఉంది అన్నారు. 

రచయితలకు, దర్శకులకు కథలు రాసుకు రమ్మని చెప్పండి తప్పకుండా చేస్తాము అన్నారు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమా రిలీజ్ కి రెడీ ఉంది. ఈ మూవీతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఈమూవీ తరువాత వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, మూవీ చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా దాదాపు మొత్తం పూర్తి అయ్యిందని వెల్లడించాడు. ఇక ఈ సినిమా తరువాత కూడా మట్కా మూవీ చేయబోతున్నాడు. త్వరలోనే ఈమూవీ షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది అన్నారు. 

అయితే మట్కా మూవీ షూటింగ్ విషయంలోనే కొంచెం డౌట్స్ ఉన్నాయి. చిన్న సందిగ్దం కూడా నెలకుందని చెప్పుకొచ్చాడు. ఇటీవల వరుణ్, లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి డేట్ ఫిక్స్ అయిన దాన్నిబట్టి మట్కా షూటింగ్ డిసైడ్ అవుతుందని వరుణ్ వెల్లడించాడు. ఇక త్వరలో వీరి పెళ్ళి ఘనంగా ఇటలీలో జరగబోతున్నట్టు తెలుస్తోంది.