Asianet News TeluguAsianet News Telugu

వరుణ్ తేజ్ 'అంతరిక్షం' టీజర్ డేట్ ఫిక్స్!

ఫిదా - తొలిప్రేమ వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ కథల ఎంపికలో రూటు మార్చినట్లు క్లియర్ గా అర్ధమవుతోంది. ప్రేమ కథలతో ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్న ఈ యువ హీరో నెక్స్ట్ ‘అంతరిక్షం 9000కెఎమ్ పిహెచ్’ సినిమాతో రానున్నాడు.

varun tej anthariksham teaser date
Author
Hyderabad, First Published Oct 15, 2018, 6:57 PM IST

ఫిదా - తొలిప్రేమ వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ కథల ఎంపికలో రూటు మార్చినట్లు క్లియర్ గా అర్ధమవుతోంది. ప్రేమ కథలతో ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్న ఈ యువ హీరో నెక్స్ట్ ‘అంతరిక్షం 9000కెఎమ్ పిహెచ్’ సినిమాతో రానున్నాడు. ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే ఎండింగ్ కు వచ్చింది. 

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో  చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఘాజి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్టోబర్ 17న సాయంత్రం 4గంటలకు టీజర్ విడుదల ఉంటుందని అధికారికంగా ఖరారు చేశారు. 

తెలుగులో వస్తున్న మొదటి స్పెస్ జానర్ చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. వరుణ్ తేజ్ ఒక వ్యోమగామిగా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం వరుణ్ విదేశాలకు వెళ్లి స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అదితి రావ్ హైదరి మరియు లావణ్య త్రిపాఠీ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్ 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios