Asianet News TeluguAsianet News Telugu

వరుణ్ తేజ్ 'అంతరిక్షం' టీజర్!

వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు సంకల్ప్ రెడ్డి 'అంతరిక్షం' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీలోనే తొలిసారి స్పేస్ నేపధ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇదే. వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

varun tej anthariksham movie teaser
Author
Hyderabad, First Published Oct 17, 2018, 4:17 PM IST

వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు సంకల్ప్ రెడ్డి 'అంతరిక్షం' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీలోనే తొలిసారి స్పేస్ నేపధ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇదే.  వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది. సన్నివేశాలు మొత్తం స్పేస్ బ్యాక్ డ్రాప్ లోనే సాగాయి. జీరో గ్రావిటీలో ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన స్పేస్ సెట‌ప్‌లో ఈ అంత‌రిక్షం సినిమాను చిత్రీక‌రించారు ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి.

ఈ చిత్రం కోసం అత్యున్న‌త సాంకేతిక విభాగం ప‌ని చేశారు. హాలీవుడ్ యాక్ష‌న్ నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అధ్బుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించారు. టీజర్ కూడా విజువల్ గా ఎంతో ఆకట్టుకుంది. ప్రతి ఫ్రేమ్ ఎంతో రియలిస్టిక్ గా కనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

సినిమాలో నటించిన తారలందరూ కూడా యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి, సాయిబాబు జాగ‌ర్ల‌మూడి, వై రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది!

 

Follow Us:
Download App:
  • android
  • ios