లావణ్య త్రిపాఠితో (Lavanya Tripathi) తను లవ్‌లో ఉన్నాడని కొంతకాలంగా మీడియాలో వార్తలు వెలువడతున్నాయి. అయితే తాము మంచి స్నేహితులం మాత్రమేనని ఈ జంట స్టేట్‌మెంట్ ఇచ్చినప్పటికీ...

మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నాడనే వార్త నేషనల్ మీడియాలో గుప్పుమంది. ఆ న్యూస్ ప్రకారం ప్రముఖ హీరోయిన్ తో ఎంగేజ్మెంట్ కి సన్నాహాలు జరుగుతున్నాయట. గత కొంత కాలంగా..వరుణ్‌తేజ్‌-లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ నడుస్తోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఈ వార్త తెరపైకి వచ్చింది. లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ నిశ్చితార్థం జూన్ లో జరగనుందని పింక్ విల్లా సౌత్ మీడియా సంస్థ పేర్కొంది. ఈ ఏడాదిలోనే వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని తెలిపింది. 

ఇక ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీతో పాటు.. అతికొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితులు హాజరుకానున్నారట. ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబసభ్యులు నిశ్చయించినట్లు చెప్తున్నారు.ఆ కథనం ప్రకారం ...గత కొద్ది రోజులుగా వీరిద్దరూ జంటగా పార్టీలకు, ఫ్యామిలీ ఫంక్షన్లకు హాజరయ్యారని, అయితే తామిద్దరి మధ్య అనుబంధాన్ని వారు కొట్టిపడేసేవారని ఆ సంస్థ వివరించింది. ప్రతీ సారి మీడియాకు తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమేనని చెప్పేవారని పింక్ విల్లా సౌత్ వెల్లడించింది. 

 వ‌రుణ్‌, లావ‌ణ్య 'మిస్ట‌ర్‌', 'అంత‌రిక్షం' చిత్రాల్లో జంటగా న‌టించారు. ఈ సినిమాల షూటింగ్ సమయంలోనే వీరిమధ్య ప్రేమ మొదలైందిట. మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతీ ఈవెంట్స్‌లో లావణ్య త్రిపాఠి సందడి చేయడంతో ఈ వార్తలకి మరింత బలం చేకూరింది. రీసెంట్‌గా నాగబాబు కూడా వరుణ్‌తేజ్‌కు త్వరలోనే పెళ్లి చేయనున్నామని, ఈ విషయాన్ని స్వయంగా వరుణ్‌ అనౌన్స్‌ చేస్తాడని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కథనంలో నిజం ఎంత అన్నది మెగా కుటుంబం నుంచి ఏదైనా ప్రకటన వస్తే తప్ప నిర్ధారించలేం. లేదా లావణ్య త్రిపాఠి అయినా దీనిపై ఏదైనా హింట్ ఇస్తే స్పష్టత వస్తుంది.