వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాండీవధారి అర్జున' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ఆగష్టు 24న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ ఏడాదే నెలల వ్యవధిలోనే వరుణ్ తేజ్ తన మరో చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాడు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పీడు మాములుగా లేదు. ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాండీవధారి అర్జున' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ఆగష్టు 24న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ ఏడాదే నెలల వ్యవధిలోనే వరుణ్ తేజ్ తన మరో చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాడు. వరుణ్ తేజ్ డెబ్యూ దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
చాప కింద నీరులా ఈ చిత్ర షూటింగ్ పూర్తవుతోంది. తాజగా ఈ చిత్ర టైటిల్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ' ఆపరేషన్ వాలంటైన్' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ ద్వారా సినిమా బ్యాక్ డ్రాప్ కూడా తెలిపారు. ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. టైటిల్ పోస్టర్ లో ఇండియా బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ ఫిలిం అని ప్రకటించారు.
వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఆకాశ వీధిలో కళ్ళు చెదిరే విన్యాసాలు గ్యారెంటీగా ఉంటాయి. ఈ చిత్రానికి రిలీజ్ డేట్ కూడా ప్రకటించి చిత్ర యూనిట్ ఆశ్చర్యపరిచింది. డిసెంబర్ 8న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ రేంజ్ స్పీడ్ ఏంటి బాబోయ్ అని అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఈ చిత్రంలో మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. సోని పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ ద్విభాషా చిత్రంగా రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబర్ 8న ఆకాశం ప్రతిధ్వనించే ఇండియా గర్జనని వినండి అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుసగా యాక్షన్ చిత్రాలని ఎంచుకుంటున్నాడు. గాండీవధారి అర్జున మూవీ కూడా యాక్షన్ చిత్రమే. ఈ చిత్రంలో వరుణ్ ఏజెంట్ గా నటిస్తున్నాడు.
