బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు మెగాహీరో వరుణ్ తేజ్. హీరోగా తన కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న ఈ సమయంలో వరుణ్ తేజ్ విలన్ గా నటించడానికి రెడీ అవుతున్నాడు.

ఈ విషయాన్ని తాజాగా వరుణ్ తేజ్ కన్ఫర్మ్ చేశాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో కోలివుడ్ సినిమా 'జిగర్ తండా' రీమేక్ తెరకెక్కనుంది. ఇందులో విలన్ గా వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. 2014 లో వచ్చిన 'జిగర్ తండా' సినిమాలో హీరోగా సిద్ధార్థ్ నటించగా.. విలన్ పాత్రలో బాబీ సింహా కనిపించాడు. 

సినిమా ప్లాట్ ఏంటంటే.. నిజమైన గూండా జీవితంతో సినిమా చేయాలనుకుంటాడు హీరో సిద్ధార్థ్. రీసెర్చ్ లో భాగంగా గూండాని కలుస్తాడు. అయితే ఆ గూండా తనను హీరోగా పెట్టి సినిమా చేయమని  డిమాండ్ చేస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో హీరో సినిమా తీస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది కథ. ఈ సినిమా తెలుగులో 'చిక్కడు దొరకడు' పేరుతో విడుదలైంది.

కానీ సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు మళ్లీ అదే కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చి రీమేక్ చేయబోతున్నారు దర్శకుడు హరీష్ శంకర్. కథ ప్రకారం విలన్ పాత్రలో వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు హరీష్ శంకర్ తో చిన్నపాటి డిస్కషన్ పూర్తైనట్లు వరుణ్ వెల్లడించాడు.