వరుణ్ తేజ్ - శర్వానంద్ మొదటి సారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడటంతో మొన్నటివరకు అందరిలో ఎంతో ఆసక్తి రేగింది. ఎందుకంటే అంతరిక్షం ఒక స్పెస్ థ్రిల్లర్ - ఇక పడి పడి లేచే మనసు డిఫరెంట్ లవ్ స్టోరీ కావడంతో రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. దీంతో ఇద్దరిపై అంచనాలు భారీగానే పెరిగినప్పటికీ రిలీజ్ అనంతరం ఒక్కసారిగా నీరాశకు గురిచేశాయి. 

రెండు సినిమాల కలెక్షన్స్ లో పెద్దగా చెప్పుకోదగ్గ ఫిగర్స్ ఏమి రాబట్టలేకపోయాయి. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ అంతంత మంత్రంగానే వచ్చాయి. రెండు సినిమాల థ్రియేటికల్ వాల్యూ 20 కోట్లకు పైగానే ఉంది. మొదటివారమే సగం షేర్స్ అందాలి. కానీ అంతరిక్షం 4.35 కోట్ల షేర్స్ అందుకోగా పడి పడి లేచే మనసు 5 కోట్ల షేర్స్ అందుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 

రెండు సినిమాలకు మొదటి షోకే డివైడ్ టాక్ రావడంతో యావరేజ్ టాక్ తెచ్చుకున్న KGFకు బలం చేకూరినట్టయ్యింది. ఆ సినిమా మంచి కలెక్షన్స్ తో బయ్యర్స్ కి లాభాలను అందిస్తోంది. శర్వా - వరుణ్ ఇద్దరు కూడా ఇలాంటి రిజల్ట్ ను ఉహించలేదనే చెప్పాలి. పోటీ పడతారనుకుంటే పరభాషా సినిమా ముందు ఇద్దరు డౌన్ అయ్యారు. మరి మొత్తంగా బయ్యర్స్ కి ఈ సినిమాలు ఎంత నష్టాలను మిగులుస్తాయో చూడాలి.