సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ఫైట్ లో టాలీవుడ్ సినిమాల సక్సెస్ రేట్ ఎంతగా పడిపోయిందో చివరలో F2 సినిమాతో ఒక్కసారిగా బిజినెస్ ని నిలబెట్టింది. వరుణ్ తేజ్ - వెంకటేష్ నటించిన ఈ మల్టీస్టారర్ 100 కోట్ల గ్రాస్ ను అందుకోవడానికి మరో అడుగు దూరంలో ఉంది. ఇప్పటికే దిల్ రాజుకి 60 కోట్ల షేర్స్ ను అందించిన ఈ సినిమా ఈ వీక్ లో కూడా గట్టిగా రాబడితే న్యూ రికార్డ్ కొట్టేసినట్టే. 

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ సంక్రాంతిలో దిల్ రాజుకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నష్టాలతో దెబ్బేస్తే వరుణ్ తేజ్ లాభాలతో నిలబెట్టాడు. వినయ విధేయ రామ సినిమాను నైజంలో డిస్ట్రిబ్యూటీ చేసిన దిల్ రాజుకి ఆ సినిమా 5 కోట్లకు పైగా  నష్టాలను మిగిల్చింది. ఇక వరుణ్ సినిమా F2 మాత్రం అంతకు మించిన ప్రాఫిట్స్ ను అందిస్తోంది. ఈ విధంగా మెగా హీరోల వలన దిల్ రాజు ఈ సంక్రాంతికి నష్ట లాభాలను చూశాడు, 

మొత్తానికి ఈ బడా ప్రొడ్యూసర్ చాలా రోజుల అనంతరం హిట్టందుకున్నాడనే చెప్పాలి. 2.0 సినిమా బిజినెస్ లో కూడా దిల్ రాజ్ ఇన్వెస్ట్ చేయగా ఆ సినిమా పెద్దగా లాభాలను ఇవ్వలేదు. గత ఏడాది వచ్చిన హలో గురు ప్రేమ కోసమే - శ్రీనివాస కళ్యాణం కూడా దిల్ రాజుకి నష్టాలను మిగిల్చాయి. ఫైనల్ గా అనిల్ F2 దిల్ రాజుని సేవ్ చేయడమే కాకుండా మరిన్ని మల్టీస్టారర్ లు తెరకెక్కడానికి ప్రేరణగా నిలిచింది.