Asianet News TeluguAsianet News Telugu

షాక్‌ ఇస్తోన్న వరుణ్‌ సందేశ్‌.. `ఇందువదన` ఫస్ట్ లుక్‌

అన్నట్టుగానే సర్‌ప్రైజింగ్‌ లుక్‌లో ఫిదా చేస్తున్నాడీ యంగ్‌ హీరో. తాజాగా సోమవారం తాను నటిస్తున్న `ఇందువదన` చిత్రంలోని ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.

varun sandesh new movie induvadana first look viral  arj
Author
Hyderabad, First Published May 3, 2021, 12:04 PM IST

`కొత్త బంగారు లోకం` ఫేమ్‌ వరుణ్‌ సందేశ్‌ కొత్త సినిమా ఫస్ట్ లుక్‌ అదిరిపోయేలా ఉంది. తన ఫస్ట్ లుక్‌ మరో రెండు రోజుల్లో వస్తుంది. వరుణ సందేశ్‌ ఏంట్రా ఇలా ఉన్నాడని అంతా ఆశ్చర్యపోతారని ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే సర్‌ప్రైజింగ్‌ లుక్‌లో ఫిదా చేస్తున్నాడీ యంగ్‌ హీరో. తాజాగా సోమవారం తాను నటిస్తున్న `ఇందువదన` చిత్రంలోని ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో కళాత్మకంగా హీరోహీరోయిన్లు ఆలింగనం చేసుకుని ఉన్నారు. ఈ ఫస్ట్ లుక్‌ ఆకట్టుకోవడంతో  వైరల్‌ అవుతుంది. 

`శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై  నైనిష్య & సాత్విక్ స‌మ‌ర్ప‌ణ‌లో MSR దర్శకత్వం వ‌హిస్తుండగా, దీన్ని శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత `ఇందువదన` సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. తాజాగా విడుదలైన  `ఇందువదన` ఫస్ట్ లుక్‌ చాలా కళాత్మకంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన వస్తుంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్  కథాపరంగా  చాలా అద్భుతంగా డిజైన్ చేశారు దర్శకుడు MSR` అని చిత్ర యూనిట్‌ తెలిపింది. 

`వరుణ్ సందేశ్ `ఇందువదన` సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామ`ని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. నటీనటులు:  వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కృష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక (కార్తికదీపం ఫేమ్), జెర్సీ మోహన్తదితరులు. 

టెక్నికల్ టీం: 
దర్శకుడు: MSR
బ్యానర్: శ్రీ బాలాజీ పిక్చర్స్
స‌మ‌ర్ప‌ణ:  నైనిష్య & సాత్విక్
నిర్మాత: శ్రీమతి మాధవి ఆదుర్తి
కో. ప్రొడ్యూసర్: గిరిధర్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సతీష్ ఆకేటి 
సంగీతం: శివ
కాకాని
కో డైరెక్టర్: ఉదయ్ రాజ్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఆర్ట్: వై నాగు
లిరిక్స్: భాస్కరబట్ల, తిరుపతి జావన
లైన్ ప్రొడ్యూసర్స్: సూర్యతేజ ఉగ్గిరాల, వర్మ
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్.

Follow Us:
Download App:
  • android
  • ios