మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ కియారా అద్వానీ. తొలి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన ఈ అందాల భామ బాలీవుడ్‌లోనూ బిజీ అవుతోంది. లస్ట్ స్టోరీస్‌తో బాలీవుడ్‌లో సెన్సేషన్‌ సృష్టించిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తాజాగా ఈ భామ తన సోషల్ మీడియా పేజ్‌లో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేసింది.

బాలీవుడ్‌ యంగ్ హీరో వరుణ్‌ ధావన్‌తో కలిసి నటించకపోయినా కలంక్‌ సినిమాలో గెస్ట్ రోల్‌లో వరుణ్‌ ధావన్‌తో కలిసి ఆడిపాడింది. ఆ పాట రిహార్సల్స్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా పేజ్‌లో ఫేర్ చేసింది కియారా. అయితే ఈ వీడియోలో వరుణ్‌, కియారాల కెమిస్ట్రీకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అదే సమయంలో ఆ వీడియోలో ఓ మూమెంట్‌ చేస్తుండగా కియారా తల వరుణ్ ముక్కుకు బలంగా తాకింది.

గతంలో ఈ సంఘటన గురించి మాట్లాడిన వరుణ్ ధావన్‌, కియారా కావాలనే తనను గాయపరిచిందని సరదాగా కామెంట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయటంతో వైరల్‌గా మారింది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన తారలు తమ గత అనుభవాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు, అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పాటు పలు మీడియా సంస్థలతో ముచ్చటిస్తున్నారు.