బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ నేడు వివాహం చేసుకుంటున్నారు. వరుణ్ తన చిరకాల ప్రేయసి  నటాషా దలాల్ మెడలో మూడు ముళ్ళు వేయనున్నాడు. చాలా కాలంగా ఈ వివాహం వాయిదా పడుతూ వస్తుండగా నేడు కుదిరించి. గత కొన్ని రోజులుగా వరుణ్ నివాసంలో పెళ్లి సందడి నెలకొంది. ఆయన తన మిత్రులతో బ్యాచ్ లర్ పార్టీ చేసుకోగా ఫోటోలు వైరల్ అయ్యాయి. 

నిన్న శనివారం సంగీత్ తో పాటు మెహందీ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దర్శక నిర్మాత కరణ్ జోహార్ తో పాటు, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్ మరియు అలియా భట్ స్టెప్స్ వేశారు. సదరు వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక వరుణ్ పెళ్ళికి బాలీవుడ్ ప్రముఖులు అందరూ హాజరు కానున్నారు. సల్మాన్ ఖాన్, కత్రినా ఖైఫ్, షారుక్ ఖాన్, సాజిద్ నడియావాలా మరియు జాక్విలిన్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. 

ఫ్యాషన్ డిజైనర్ అయిన నటాషా దలాల్ తో  వరుణ్ ధావన్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు.  ఇక వరుణ్ ధావన్ లేటెస్ట్ మూవీ కూలీ నంబర్ వన్ ఇటీవల విడుదలైంది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటించారు. ప్రస్తుతం ఆయన  జగ్ జగ్ జియో చిత్రంలో నటిస్తుండగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీలో అనిల్ కపూర్, కియారా అద్వానీ కూడా నటిస్తున్నారు.