ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనను ట్వీటర్ లో అకారణంగా బ్లాక్ చేశాడని హీరోయిన్ ఆరోపించింది. స్కీన్ షాట్లతో ట్వీ్టర్ వేదికన ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో బన్నీ వెంటనే అన్ బ్లాక్ చేయడం ఆసక్తికరంగా మారింది. 

‘పుష్ప’ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ అమాంతం పెరిగింది. సౌత్ తో పాటు నార్త్ లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ సందర్భంగా యంగ్ యాక్ట్రెస్ తో సహా చాలా మంది నటీనటులు ఆయన సరసన నటించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ గతంలో బన్నీ తో కలిసి నటించిన ఓ హీరోయిన్ ప్రస్తుతం ఆయనపై ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారింది. బన్నీ తనను సోషల్ మీడియాలో బ్లాక్ చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేసి బహిరంగంగా ప్రశ్నించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇంతకీ ఇంత హంగామా చేస్తున్న హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? మరెవరో కాదు.. గతంలో అల్లు అర్జున్ సరసన నటించిన భాణుశ్రీ మెహ్రానే (Bhanu sri Mehra). సరిగ్గా 12 ఏండ్ల కింద ఇదే నెలలో (మార్చి) విడుదలైన ‘వరుడు’ చిత్రంలో అల్లు అర్జున్ - భాణుశ్రీ మెహ్రా జంటగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతోనే హీరోయిన్ గా భాణుశ్రీ కేరీర్ ప్రారంభమైంది. సినిమా పెద్దగా ఆడకపోయినా.. ఫ్యాన్స్ కు గుర్తుండిపోయే మూవీగా ఉండింది. దాంతో భాణు శ్రీకి అడపాదడపా అవకాశాలు అందాయి.

Scroll to load tweet…

అయితే, అల్లు అర్జున్ తనను ట్వీటర్ లో బ్లాక్ చేశాడంటూ తాజాగా ఈ బ్యూటీ ఆరోపణలు చేసింది. బన్నీ ట్వీటర్ లో బ్లాక్ చేసిన పేజీని స్క్రీన్ షాట్ తీసి మరీ ట్వీటర్ లో పోస్ట్ చేసింది. ‘నేను వరుడు సినిమాలో బన్నీ సరసన నటించాను. ఇప్పటికీ పెద్దగా అవకాశాలు లేవు.అయినా ప్రయత్నిస్తున్నాను. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ నన్ను ట్వీటర్ లో బ్లాక్ చేశాడు. సబ్ స్క్రైబ్ చేయు’ అంటూ ట్వీట్ చేసింది. రెండు మూడు గంటల తర్వాత అల్లు అర్జున్ ఆమెను అన్ బ్లాక్ చేశారు. దీనిపై మళ్లీ ట్వీట్ చేసింది.

Scroll to load tweet…

మరో ట్వీట్ లో... ‘గ్రేట్ న్యూస్.. అల్లు అర్జున్ నన్ను అన్ బ్లాక్ చేశారు. నా కేరీర్ సెట్ బ్యాక్ చేసుకోవడం కోసం అతన్ని బ్లేమ్ చేయడం లేదు. నా కష్టాల్లో నవ్వుతూ ముందుకు సాగిపోవడమే నేర్చుకుంటున్నారు. మున్ముందు మరింత మంచి కోసం వేచి ఉండండి. అలాగే అల్లు అర్జున్ కు ధన్యవాదాలు’ అని పేర్కొంది. అయితే అల్లు అర్జున్ కు ఆ హీరోయిన్ మధ్య ఏం జరిగింది. ఎందుకు ఆమెను బ్లాక్ చేశాడు? ఆమె ఆరోపించగానే గంటల వ్యవధిలోనే ఎందుకు మళ్లీ అన్ బ్లాక్ చేశాడనేది.. ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ మేరకు ఫ్యాన్స్ కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప ది రూల్’లో నటిస్తున్నారు.