నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు.. ఎన్టీఆర్ గారి బయోపిక్ తీయడమే. ఈ మాట బాలకృష్ణ అనలేదు. వర్మ గ్రాఫిక్స్ లో బాలకృష్ణతో డబ్ చేయించిన ఈ వీడియో చూసి ఇప్పుడు నందమూరి అభిమానులు మరింత ఆగ్రహానికి గురవుతున్నారు. వర్మ ప్రమోషన్స్ పిచ్చి పరాకాష్టకు చేరుకుందని కామెంట్స్ చేస్తుండగా ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. 

లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం మొన్నటివరకు పోస్టర్స్ తో రచ్చ  చేసిన వర్మ ఇప్పుడు వీడియోలను తనదైన శైలిలో మార్చుకుంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాడు. బాలకృష్ణ మహానాయకుడు సంబందించి లుక్ కి వాయిస్ మిమిక్రీని యాడ్ చేసి అచ్చం బాలయ్య చెబుతున్నటుగా మాయ చేశాడు; 

నా మొత్తం జీవితం ఎన్టీఆర్ బయోపిక్ చేయడమే తప్పు అన్నట్లు బాలకృష్ణ చెబుతూ ఉండడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. బాలయ్య అభిమానులు వర్మపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రేపు సినిమాలోని పాటను వీడియో రూపంలో రిలీజ్ చేయడానికి ఆర్జీవీ సిద్ధమవుతున్నారు.

మెగాస్టార్ తో మొదలైన దర్శకుల జీవితాలు.. ఒకేసారి ఎండ్