దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి కోపం వచ్చింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో కోర్టుకు వెళ్లి పోరాడతాను అని శపధం చేస్తున్నాడు. నందమూరి తారక రామారావు గారి జీవితంలోకి లక్ష్మి పార్వతి ఎంట్రీ తరువాత ఎలాంటి పరిణామాలు నెలకొన్నాయి అనే  అంశంపై వర్మ సినిమాను తెరకెక్కించాడు. 

అయితే ఇందులో చంద్రబాబు పాత్రను కావాలని నెగిటివ్ గా చూపించారని ఇదివరకే ఢిల్లీలోని కేంద్రం ఎన్నికల సంఘానికి తెలుగు దేశం పార్టీ వర్గం వారు పిర్యాదు చేశారు. అయితే సెన్సార్ బోర్డుదే తుది నిర్ణయం అన్నట్లు నిన్నా మొన్న కథనాలు రావడంతో సినిమాకు పెద్దగా ఇబ్బందులు లేవని అంతా భావించారు. 

కానీ ఇప్పుడు సెన్సార్ బోర్డు తొలి దశ పోలింగ్‌ (11-04-2019) ముగిసేసవరకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని లేఖ ద్వారా చెప్పడంతో వర్మ చట్టపరమైన చర్యలకు సిద్దమవుతున్నాడు. సెన్సార్ బోర్డు తన హద్దులు మీరు ప్రవర్తిస్తోందని చెబుతూ ఇదివరకు పలు కేసుల విషయంలో సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పులపై క్లారిటీ ఇచ్చారు.