Asianet News TeluguAsianet News Telugu

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ లేడీ ఓరియెంటెడ్‌ మూవీ.. పాన్‌ ఇండియా రిలీజ్‌..

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యింది. ఇప్పుడు ఆమె లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంతో రాబోతుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ కానుందట. 
 

varalaxmi sarathkumar coming with lady oriented movie pan indian release arj
Author
First Published Apr 7, 2024, 11:09 PM IST

వరలక్ష్మి శరత్ కుమార్‌.. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె తెలుగు నటి అయిపోయింది. శరత్ కుమార్‌ కూతురు అయిన వరలక్ష్మీ తమిళంలో నటిగా కెరీర్ ని ప్రారంభించింది. నెమ్మదిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ తనకంటూ ఓ గుర్తింపుని సంపాదించుకుంది. విలక్షణమైన నటనతో మెప్పిస్తుంది. `నాంది`, `క్రాక్‌`, `యశోద`, `వీరసింహారెడ్డి`, `హనుమాన్‌` చిత్రాల్లో ఆమె నటన ఎంతగా అలరించిందో తెలిసిందే. దీంతో తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరైంది వరలక్ష్మి. 

ఇప్పుడు ఆమె లేడీ ఓరియెంటెడ్‌ సినిమాతో రాబోతుంది. `శబరి` పేరుతో ఈ మూవీ తెరకెక్కింది. అనిల్‌ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని మహా మూవీస్‌ పతాకంపై మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మిస్తున్నారు. మహర్షి కూండ్ల సమర్పకులు. చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాకి సంబంధించిన రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది యూనిట్‌. మే 3న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 

ఆ విశేషాలను నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల తెలియజేస్తూ, `సరికొత్త కథాంశంతో `శబరి` సినిమాని తెరకెక్కించామని, కథ, కథనాలు ఇన్నోవేటివ్ గా ఉంటాయని, స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రమిదని తెలిపారు. వరలక్ష్మీ శరత్ కుమార్ తో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉందని, ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా ఆమె నటన 'వావ్' అనేలా ఉంటుందని, తెలుగు, తమిళ వెర్షన్స్ ఫస్ట్ కాపీ రెడీ అయ్యిందని, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం పూర్తి అయ్యాయని చెప్పారు. `సినిమా అవుట్ పుట్ పట్ల మేం చాలా హ్యాపీగా ఉన్నాం. సినిమా మాకు అంతలా నచ్చింది. 'వరల్డ్ ఆఫ్ శబరి' పేరుతో విడుదల చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 3న పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. అన్ని భాషలు, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నా`మని చెప్పారు. 

ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ తోపాటు గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 

సాంకేతిక బృందం:
ఈ చిత్రానికి రచనా సహకారం: సన్నీ నాగబాబు, పాటలు: రహమాన్, మిట్టపల్లి సురేందర్, మేకప్: చిత్తూరు శ్రీను, కాస్ట్యూమ్స్: అయ్యప్ప, కాస్ట్యూమ్ డిజైనర్: మానస, స్టిల్స్: ఈశ్వర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: లక్ష్మీపతి కంటిపూడి, కో- డైరెక్టర్: వంశీ, ఫైట్స్: నందు - నూర్, కొరియోగ్రాఫర్స్: సుచిత్ర చంద్రబోస్ - రాజ్ కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పూలాల, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, సంగీతం: గోపి సుందర్, సమర్పణ: మహర్షి కూండ్ల, ప్రొడ్యూసర్: మహేంద్ర నాథ్ కూండ్ల, కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: అనిల్ కాట్జ్.
 

Follow Us:
Download App:
  • android
  • ios