మహిళా సాధికారత గురించి స్పందించటంలో దక్షిణాది తార వరలక్ష్మి శరత్ కుమార్ ముందు వరుసలో వుంటారు. కాస్టింగ్ కౌచ్ పైనా నిర్భయంగా నిక్కచ్చిగా మాట్లాడిన వరలక్ష్మి... తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తనదైన శైలిలో స్పందించారు.

 

పెళ్లయ్యాక మొగుళ్లు పెళ్లాలను కొట్టడం తరచూ జరుగుతోందని.. అలా చేసే మొగుళ్లని తిగిగి తన్నాల్సిందేనని వరలక్ష్మి వ్యాఖ్యానించారు. భవిష్యత్ తరాలకు మంచి సందేశం ఇవ్వాల్సిన అవసరం వుందన్నాారు. మహిళలను గౌరవించే సంప్రదాయం కొనసాగేలా చూడాల్సిన బాధ్యతత అందరిపైనా వుందన్నారు. పెళ్లాలను కొట్టే మొగుళ్లకు గుణపాఠం చెప్పాల్సిందేనన్నారు.

 

అంతేకాక పని చేసే చోట మహిళలకు మరింత రక్షణ అవసరమన్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అందరిపైనా వుందన్నారు వరలక్ష్మి శరత్ కుమార్.