మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్నవంగ‌వీటి సినిమా  ప‌లు వివాదల‌తో వంగ‌వీటి మూవీకి పుల్ ప‌బ్లిసిటి వ‌చ్చింది తాజాగా రామ్ గొపాల్ వ‌ర్మ మ‌రో వివాదంలో లో చిక్కుకున్నాడు  

అయితే ఈ మూవీలో వంగవీటి పాటకు సంబంధించి ఓ వివాదం రాజుకుంది. ఆ పాట పాడినది తానే అని.. తాను వంగవీటి పాటకు సంగీతం కూడా అందిస్తే.. మూవీ క్రెడిట్స్ తన వేరు వేయలేదంటూ రాజశేఖర్ పన్నాల అనే వ్యక్తి మీడియాకి ఎక్కాడు. సినిమాలో తన పేరు వేయమని కానీ.. తనకు రెమ్యూనరేషన్ ఇవ్వాలని కానీ తాను అడగడం లేదని.. ఎవరి మీదా కంప్లెయింట్ చేసే ఉద్దేశ్యం కూడా లేదన్న ఈయన.. దయచేసి వంగవీటి సినిమాలోంచి వంగవీటి పాటను తీసేయమంటున్నాడు.

దీనికి వర్మ నుంచి కూడా ఘాటైన ఆన్సరే వచ్చింది. ఎవరికీ తెలియని ఆ పన్నాల రాజశేఖర్ ను తానే అందరికీ పరిచయం చేశానని.. విజయవాడలో జరిగిన ఆడియో ఫంక్షన్ లో రాజశేఖర్ పన్నాలను పరిచయం చేయడంతోపాటు.. ఆ పాట రాశాడని చెప్పానన్న వర్మ.. స్టేజ్ పైనే పాడించిన సంగతిని గుర్తు చేశాడు. సాంకేతికంగా జరిగిన పొరపాటుకు ఇలా మీడియాకి ఎక్కి రాద్ధాంతం చేయడం.. పాట తీసేయమనడం అసంబద్ధం అంటున్నాడు వర్మ.