సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాగుందని కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు మాత్రం సినిమాలో లోపాలను ఎత్తిచూపిస్తున్నారు. సినిమాను చూస్తుంటే రెండు సినిమాలు చూసిన ఫీలింగ్ కలిగిందని కామెంట్స్ వస్తున్నాయి.

దీనిపై దర్శకుడు వంశీ పైడిపల్లి రియాక్ట్ అయ్యాడు. నిజమే.. మహర్షి సినిమా చూస్తే రెండు సినిమాలు చూసినట్లు అనిపిస్తుందని ఒప్పుకున్నాడు. దానికి కారణం స్క్రీన్ ప్లేలో మిస్టేక్ కాదని, కేవలం కథ పెద్దగా ఉండడం వలన ఆ ఫీలింగ్ కలిగి ఉంటుందని అన్నారు. 

సినిమా ఫస్ట్ హాఫ్ లో ఓ బ్యాక్ డ్రాప్ ఉంటుందని, సెకండ్ హాఫ్ లో మరో బ్యాక్ డ్రాప్ ఉంటుందని.. సెకండ్ హాఫ్ లో వచ్చిన బ్యాక్ డ్రాప్ ను ఫస్ట్ హాఫ్ లో, కాలేజ్ బ్యాక్ డ్రాప్ ని సెకండ్ హాఫ్ లో చూపించలేదని అన్నారు. ఆ కారణంగానే ప్రేక్షకులకు రెండు సినిమాలు చూసిన ఫీలింగ్ కలిగిందని.. కానీ మొదటి భాగం లేకపోతే రెండో భాగం లేదనే విషయాన్ని గుర్తించాలని అన్నారు.

రివ్యూలు ఎలా ఉన్నప్పటికీ సగటు ప్రేక్షకులు సినిమా గురించి ఏం అనుకుంటున్నాడనేదే ముఖ్యమంటూ మీడియాకి చురకలు అంటించారు. అలానే రన్ టైం గురించి మాట్లాడుతూ.. ''నిడివి ఎక్కువవుతుందని ట్రిమ్ చేస్తే చివరి ముప్పై నిమిషాలు అంత ఎమోషనల్ గా వచ్చేది కాదన్నాడు. సినిమాను ట్రిమ్ చేసే ఆలోచన లేదని, శనివారం నుండి థియేటర్లు పెంచుతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.