Asianet News TeluguAsianet News Telugu

‘వాల్మీకి’ టైటిల్ వివాదం.. కేంద్ర మంత్రికి దగ్గరకి

కొద్ది రోజుల క్రితం వాల్మీకి సినిమా టైటిల్‌ను మార్చాలని కోరుతూ  సీజీఓ టవర్స్‌లోని సెన్సార్‌ బోర్డు కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్,  భజరంగ్‌దళ్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ టైటిల్‌ మార్చాలని బోయ కులస్తులు తీవ్ర ఆందోళన చేసారు. వాల్మీకి బోయలతో పాటు హిందువుల ఆరాధ్య దైవమని పేర్కొన్నారు.
 

Valmiki movie title complaint to Union Minister
Author
Hyderabad, First Published Sep 12, 2019, 11:18 AM IST


గత కొద్ది రోజులుగా వాల్మీకి సినిమా టైటిల్ విషయంలో వివాదం  జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ మార్చాల్సిందే అని.. ఓ వర్గం పట్టుబడుతోంది. క్రైమ్ సినిమాకు ఈ టైటిల్ పెట్టి తమ కులాన్ని అవమానిస్తున్నారని వదిలేది లేదంటున్నారు బోయ కులస్దులు. ఈ  విషయంపై ఇప్పుడు సమాచార మరియు బ్రాడ్ కాస్టింగ్ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కలిసాడు. వాల్మీకి పేరు అనేది ఎలా పడితే అలా వాడుకునేది కాదంటూ వినతి పత్రం ఇచ్చారు.
 
అలాగే కొద్ది రోజుల క్రితం వాల్మీకి సినిమా టైటిల్‌ను మార్చాలని కోరుతూ  సీజీఓ టవర్స్‌లోని సెన్సార్‌ బోర్డు కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్,  భజరంగ్‌దళ్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ టైటిల్‌ మార్చాలని బోయ కులస్తులు తీవ్ర ఆందోళన చేసారు. వాల్మీకి బోయలతో పాటు హిందువుల ఆరాధ్య దైవమని పేర్కొన్నారు.

అలాంటి మహనీయుడి పేరు మీద సినిమా తీయడం సరైంది కాదన్నారు. వెంటనే సినిమా పేరును మార్చాలని భజరంగ్‌దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఎం.సుభాశ్‌చందర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సెన్సార్‌ బోర్డు చైర్మన్‌కు రాసిన లేఖను విడుదల చేశారు.

 ఈ విషయమై గతంలో దర్శకుడు హరీష్ శంకర్  స్పందించారు.  ‘వాల్మీకిని పూజించిన రాముడు కూడా ధర్మం కోసం ఫైటింగ్‌ చేశాడు. ఏదేమైనప్పటికీ మేం వాల్మీకి సంఘం అభిప్రాయాల్ని గౌరవిస్తాం. ఈ సినిమాలో హీరో పేరు వాల్మీకి కాదని ముందే చెబుతున్నా. కాబట్టి గొప్ప వాల్మీకి పేరును మా హీరోకు పెట్టలేదు’ అని హరీష్‌ ట్వీట్లు చేశారు.
 
‘వాల్మీకి’ సినిమాలో పూజా హెగ్డే  హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ దీనిని నిర్మిస్తోంది. మిక్కీ జే మేయర్‌ బాణీలు అందిస్తున్నారు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు తెలుగు రీమేక్‌ ఇది.  త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios