Asianet News TeluguAsianet News Telugu

Valimai: అజిత్‌ ‘వాలిమై’ తెలుగు టైటిల్ ఫిక్స్

తెలుగులోనూ ఈ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఈ నేపధ్యంలో తెలుగు టైటిల్ ని ఖరారు చేసారు నిర్మాతలు. ‘వాలిమై’ చిత్రానికి తెలుగులో  టైటిల్ ఫిక్స్ చేసారు. 

Valimai will be releasing simultaneously in Tamil, Telugu & Hindi
Author
Hyderabad, First Published Dec 26, 2021, 4:01 PM IST


 అజిత్‌ నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘వాలిమై’.హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  ఇందులో అజిత్ ఈశ్వర మూర్తి అనే సీబీసీఐడీ ఆఫీసర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. అలాగే రేసర్ గా కూడా అజిత్ కనిపిస్తాడని చెబుతున్నారు .సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ చిత్రం. సౌత్ ఇండియాలోనే మోస్ట్ ఎవైటెడ్ ఫస్ట్ లుక్ లిస్ట్ లో.. వాలిమై కూడా చేరిపోయింది. దీంతో వాలిమై పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటు వాలిమై డైరెక్టర్ వినోద్ తో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే అజిత్ ప్రకటించాడు. గతంలో డైరెక్టర్ శివతో హ్యాట్రిక్ మూవీస్ చేసిన అజిత్.. తాజాగా వినోద్ కాంబినేషన్ లో కూడా మూడో మూవీ ప్రకటించాడు.అజిత్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

 తెలుగులోనూ ఈ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఈ నేపధ్యంలో తెలుగు టైటిల్ ని ఖరారు చేసారు నిర్మాతలు. ‘వాలిమై’ చిత్రానికి తెలుగులో ‘బలం’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. తమిళంలో ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. తెలుగులో రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తెలుగు హీరో కార్తికేయ మెయిన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ‘వాలిమై’లో హుమా ఖురేషి, యోగి బాబుతో పాటు పలువురు కీలక పాత్రల్లో నటించారు. 

కోలీవుడ్ నిర్మాణ సంస్థ బే వ్యూ ప్రాజెక్ట్స్.. జీ స్టూడియోస్ సహకారంతో ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.  కాగా ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు సమకూరుస్తున్నారు.

Also read Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడు...?
 

Follow Us:
Download App:
  • android
  • ios