వినాయక చవితి నాడు సాయి ధరమ్ ప్రమాదానికి గురికాగా.. దీపావళి రోజు మెగా హీరోలు అందరూ కలిసి ఆయనను లోకానికి పరిచయం చేశారు. సాయి ధరమ్ చేత కేక్ కటించి చేయించి, పెను ప్రమాదం నుంచి కోలుకున్నందుకు వెల్కమ్ చెప్పారు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)కంటికి కనిపించి మూడు నెలలు దాటిపోయింది. సెప్టెంబర్ నెలలో బైక్ ప్రమాదానికి గురైన సాయి ధరమ్... ఆసుపత్రిలో సుదీర్ఘ కాలం చికిత్స తీసుకున్నారు. ప్రమాదం జరిగిన మూడు వారాల తర్వాత కూడా ఆయన స్పృహలోకి రాకపోవడం ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేసింది. ఒక నెల ఆసుపత్రి బెడ్ కి పరిమితమైన సాయి ధరమ్.. మరో నెల రోజుల పాటు ఇంటిలో రెస్టు తీసుకున్నారు. కోలుకున్న తర్వాత కూడా సాయి ధరమ్ తేజ్ మీడియా ముందుకు రావడం లేదు.
వినాయక చవితి నాడు సాయి ధరమ్ ప్రమాదానికి గురికాగా.. దీపావళి రోజు మెగా హీరోలు అందరూ కలిసి ఆయనను లోకానికి పరిచయం చేశారు. సాయి ధరమ్ చేత కేక్ కటించి చేయించి, పెను ప్రమాదం నుంచి కోలుకున్నందుకు వెల్కమ్ చెప్పారు. మెగా హీరోలతో సాయి ధరమ్ దిగిన ఫొటో అప్పట్లో మీడియాలో హల్చల్ చేసింది. ఇక సాయి ధరమ్ యధావిదిగా కెమెరా ముందుకు వస్తారని అందరూ భావించారు. అయితే అది జరగలేదు.
దివాళి గడిచి నెలరోజులు దాటిపోయినా సాయి ధరమ్ అజ్ఞాతంలోనే ఉంటున్నారు. మరలా క్రిస్మస్ (Christmas 2021)నాడు సాయి ధరమ్ దర్శనం ఇచ్చారు. మెగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలో సాయి ధరమ్ కూడా పాల్గొన్నారు. బ్లాక్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించిన సాయి ధరమ్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. సాయి ధరమ్ మీడియా ముందుకు రాకపోవడం వెనుక బలమైన కారణం ఉందని నమ్ముతున్న కొందరికి ఈ ఫోటో ద్వారా క్లారిటీ వచ్చింది.
ఓ మేజర్ యాక్సిడెంట్ కారణంగా తీవ్ర గాయాలపాలైన సాయి ధరమ్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. రిస్క్ తీసుకోకుండా సాయి ధరమ్ డాక్టర్స్ సూచనల ప్రకారం ఇంటిలోనే ఉంటున్నారని వినికిడి. ఏది ఏమైనా సాయి ధరమ్ త్వరగా కమ్ బ్యాక్ ఇవ్వాలని, మునుపటిలా షూటింగ్స్ లో పాల్గొనాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also read Samantha Christmas celebrations:మళ్ళీ ఎన్నాళకు సమంత ముఖంలో స్వచ్ఛమైన చిరు నవ్వు..!
ఇక ప్రతిరోజూ పండగే చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్... మరలా స్లో అయ్యారు. ఆయన గత రెండు చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. సోలో బ్రతుకే సో బెటర్, రిపబ్లిక్ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో సాయి ధరమ్ ఓ సాలిడ్ హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.
Also read దుబాయ్ లో పార్టీ చేసుకుంటున్న స్టార్స్ వైవ్స్.. ఉపాసన-నమ్రత!
