ఈ యాక్షన్ థ్రిల్లర్ లో మన ఆరెక్స్ 100 కార్తికేయ విలన్ గా నటించాడు. హైదరాబాద్ ప్రమోషన్లన్నీ తనే చూసుకుంటున్నాడు. అయితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. తెలుగు టైటిల్ పెట్టకపోవటం ఈ సినిమాకు మైనస్ గా మారింది.
భీమ్లానాయక్ కు ఓ రోజు ముందు అంటే పిభ్రవరి 24న వలిమై,గంగూ భాయ్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు అదే సమస్యగా మారింది. దాదాపు అన్ని థియోటర్స్ భీమ్లానాయక్ కు కేటాయిస్తున్నారు. హైదరాబాద్ లో వలిమైకు కేవలం ఐదు లేదా ఆరు థియోటర్స్ మాత్రమే దొరుకుతున్నాయి. ఆంధ్రాలో అయితే వలీమైకు అసలు క్రేజ్ లేదు. తమిళనాట ఆన్ లైన్ లో అడ్వాన్ బుకింగ్ టికెట్లు పెట్టడం ఆలస్యం అన్నట్లు అమ్ముడైపోయి రికార్డ్ లు క్రియేట్ చేస్తున్నాయి. కానీ తెలుగులో అసలు క్రేజ్ కనపడటం లేదు. సిటీల్లో కూడా బుకింగ్స్ జరగటం లేదు.
అక్కడకి ఈ యాక్షన్ థ్రిల్లర్ లో మన ఆరెక్స్ 100 కార్తికేయ విలన్ గా నటించాడు. హైదరాబాద్ ప్రమోషన్లన్నీ తనే చూసుకుంటున్నాడు. అయితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. తెలుగు టైటిల్ పెట్టకపోవటం ఈ సినిమాకు మైనస్ గా మారింది. అందులోనూ అజిక్ కు ఇక్కడ మార్కెట్ లేదు. కార్తికేయ కు వరస ఫ్లాఫ్ లతో క్రేజ్ లేదు. హిట్ టాక్ వస్తే తప్ప పట్టించుకునే దారి కనపడటం లేదు. దానికి తోడు మీడియా,సోషల్ మీడియా మొత్తాన్ని భిమ్లానాయక్ ఆవహించేసింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ.
ఇవన్నీ చాలదన్నట్లు బుక్ మై షో లాంటి యాప్స్ మీద నైజామ్ డిస్ట్రిబ్యూటర్లు యుద్ధం. ఇవన్నీ వలిమైని ఇబ్బంది పెట్టే పరిస్దితులే. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా తెలుగు వెర్షన్ కు కేవలం రెండున్నర కోట్ల బిజినెస్ మాత్రమే చేశారు. బ్రేక్ ఈవెన్ కావాలంటే మూడు దాకా వస్తే సరిపోతుంది.కానీ అది కూడా కష్టమే అంటున్నారు. ఇప్పుడున్న పరిస్దితి చూసి. ఇందులో అజిత్ సీబీ సీఐడి అధికారిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలీవుడ్ నటుడు కార్తికేయ విలన్‌గా నటిస్తున్నారు.
ఇక అజిత్, కార్తికేయ బైక్ స్టంట్స్ ఫ్యాన్స్ చేత ఈలలు వేయించేలా ఉన్నాయనే టాక్ కాస్త ఊరట కలిగించేది. ఇక యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా చెప్పకోవచ్చు. కాగా బోణీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ హుమా కురేషి కీలక పాత్ర పోషిస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈమూవీ మరోవారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, కన్నడ భాషల్లో కూడా ఈ మూవీని విడుదల చేయనున్నారు.
