Asianet News TeluguAsianet News Telugu

తమన్నా, సత్యదేవ్ వాలెంటెన్స్ గిఫ్ట్.... రొమాంటిక్ ఫోజ్ లో ఆధారగొట్టారుగా!

వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న గుర్తుందా శీతాకాలం చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసారు. అందులో సత్యదేవ్, తమన్నా ఒకర్నొకరు రొమాంటిక్‌గా చూసుకుంటూ చేతులు కలుపుకుని ఉన్నారు. ఈ ఫోటో అభిమానులకే కాదు అందరికీ బాగా నచ్చేస్తుంది. 

Valentine day gift here is tamannah and satyadev movie first look ksr
Author
Hyderabad, First Published Feb 14, 2021, 6:50 PM IST

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగ శేకర్ తెరకెక్కిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ప్ర‌తీ ఒక్క‌రు త‌మ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విష‌యాల్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన సంఘ‌ట‌ణ‌లు ప్రేక్ష‌కుల‌కి గుర్తు చేసే ఉద్దేశంతో నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్ మీద నాగ‌శేఖ‌ర్ - భావ‌న‌ర‌వి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు గారు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ఇప్ప‌టికే ఈ సినిమా టైటిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

టాలెంటెడ్ హీరో స‌త్యదేవ్, త‌మ‌న్నా, మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై ఆసక్తి కూడా బాగానే పెరిగిపోయింది. ఇండ‌స్ట్రీలో వ‌ర్గాల్లోనూ ఈ సినిమా పై ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది. క‌న్న‌డ‌లో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ల‌వ్ మాక్ టేల్ ఆధారంగా గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ షూట్ చేసుకుని మ‌రో షెడ్యూల్ షూట్ చేసుకోవ‌డానికి సెట్స్ మీద‌కు వెళుతుంది గుర్తుందా శీతాకాలం


 వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న గుర్తుందా శీతాకాలం చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసారు. అందులో సత్యదేవ్, తమన్నా ఒకర్నొకరు రొమాంటిక్‌గా చూసుకుంటూ చేతులు కలుపుకుని ఉన్నారు. ఈ ఫోటో అభిమానులకే కాదు అందరికీ బాగా నచ్చేస్తుంది. త్వరలోనే ఈ చిత్ర ట్రైలర్ విడుదల కానుందని తెలిపారు దర్శక నిర్మాతలు. మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios