తెలుగులో రచయితగా స్టార్ స్టేటస్ తెచ్చుకున్న అతి కొద్ది మందిలో వక్కంతం వంశీ ఒకడు. రచయితగా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో అతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో అతను రైటర్ గా.. డైరెక్టర్ గా ప్రతిభ చూపించాడు. కానీ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ చిత్రానికి కలెక్షన్లు ఓ మోస్తరుగా ఉన్నాయి. నెక్ట్స ఒక పెద్ద హీరోతో తనకు సినిమా ఓకే అయిందని.. త్వరలోనే ఆ చిత్రం ప్రారంభమవుతుందని వంశీ చెప్పాడు. ‘నా పేరు సూర్య’ విడుదల తర్వాత తనకు మూడు నాలుగు ఆఫర్లు వచ్చినట్లు అతను తెలిపాడు. ఎన్టీఆర్ తో తాను ఇంతకుముందు చేయాలనుకున్న సినిమా ఆగిపోయినా తమ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని.. అయను నా ఫేవరెట్ యాక్టర్ అని.. తనను దర్శకుడు రమ్మని ప్రోత్సహించిందే అయనని.. తమ కాంబినేషన్లో కచ్చితంగా సినిమా ఉంటుందని వక్కంతం చెప్పాడు. ఎన్టీఆర్ తో చేయాలనుకున్న కథ లైన్ ఓకే అయినా.. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదని అతనన్నాడు.