నా పేరు సూర్య చిత్రంలో చిన్నప్పుడే బన్నీ ఇల్లు విడిచి వెళ్లిపోతాడు. అలా తల్లికి దూరమైన బన్నీ, తండ్రి సంతకం కోసం మళ్లీ ఇంటికొస్తాడు. కానీ అతడిని తల్లి గుర్తుపట్టదు. సరిగ్గా ఇక్కడే వక్కంతం దొరికిపోయాడు. పెరిగి పెద్దయిన బన్నీని తల్లి గుర్తుపట్టలేదని అనుకుందాం. కానీ చిన్నప్పట్నుంచి కనుబొమ్మ మీద ఉన్న గాటు చూసైనా గుర్తుపట్టాలి కదా. కనీసం ఇతడు తన కొడుకులా ఉన్నాడని అనుమానించాలి కదా. ఈ చిన్న లాజిక్ ను వక్కంతం మిస్ అయ్యాడు. సినిమా రిలీజైన వెంటనే ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి ఈ లాజిక్ గురించి ప్రశ్నించాడని, తనకు చెప్పుతో కొట్టినట్టయిందని అంగీకరించాడు వక్కంతం. ఇకపై ఇలాంటి చిన్న చిన్న లాజిక్కులు మిస్ అవ్వకుండా జాగ్రత్తపడతానని, అంతా క్షమించాలని కోరాడు. నిజానికి కనుబొమ్మపై గాటు కాన్సెప్ట్ తనది కాదంటున్నాడు వక్కంతం. సినిమాలో సూర్య పాత్ర కోపానికి గుర్తుగా ముఖంపై ఏదో ఒక దెబ్బ ఉంటే బాగుంటుందని భావించి, బన్నీనే కావాలని ఆ గాటు పెట్టించుకున్నాడని అన్నాడు.