పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగ ట్రీట్ ఇచ్చేశాడు. వకీల్ సాబ్ గా వచ్చి రౌడీలను వాయించేశాడు. సంక్రాంతి కానుకగా వకీల్ సాబ్ టీజర్ విడుదలైంది. లాయర్ గా పవన్ కళ్యాణ్ స్టైలిష్ అవతార్ అదిరింది. అబ్జక్షన్ యువర్ హానర్.. అంటూ పవన్ కళ్యాణ్ కోర్టులో గర్జిస్తున్న సీన్ అదిరిపోయింది.  తనపై దాడికి వచ్చిన రౌడీ మూకలను ఇరగొట్టిన పవన్ కళ్యాణ్... కోటు వేసుకొని వాదించడము వచ్చు... కోటు తీసి కొట్టడము వచ్చని, చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ కలిగించేలా ఉంది. 

ఏదో ముఖ్యమైన కేసు కోసం వదిలేసిన లాయర్ ప్రాక్టీస్, నల్లకోటు మరలా ధరించిన పవన్ కళ్యాణ్ థియేటర్స్ లో ఈ రేంజ్ లో పేలుతారో చూడాలి. ఒక నిమిషం నిడివి గల టీజర్ ఆకట్టుకుంది. హిందీ చిత్రం పింక్  తెలుగు రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రానికి దర్శకుడు అనేక మార్పులు చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఫైట్స్, డైలాగ్స్ భారీగానే జొప్పించినట్లు ఉన్నారు. మొత్తంగా టీజర్ అభిమానులను ఊర్రూతలు ఊగించేదిగా ఉంది. 

దర్శకుడు శ్రీరామ్ వేణు వకీల్ సాబ్ చిత్రాన్ని తెరకెక్కించారు. దిల్ రాజు మరియు బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక పవన్ కి జంటగా తక్కువ నిడివి గలిగిన పాత్రలో శృతి హాసన్ కనిపించడనుంది. వకీల్ సాబ్ మూవీలో కీలకమైన పాత్రలను అంజలి, నివేదా థామస్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్న విషయం తెలిసిందే.