‘వకీల్ సాబ్‌’ ఈ సస్పెన్స్ ఏంటి బాస్?

ట్విట్టర్ లో “వకీల్ సాబ్ టీజర్ ఆన్ దసరా” అంటూ చాన్నాళ్లు ట్రెండింగ్ జరిగింది. అబ్బే అలాంటిదేమీ లేదని తేల్చేసాడు దిల్ రాజు. ఆ తర్వాత  దీపావళికి టీజర్ అంటూ ఫీలర్,వార్తలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ తో పాటు మీడియా మొత్తం వకీల్ సాబ్ టీజర్ దీపావళికి వస్తుందని ఫిక్స్ అయ్యి ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటిదాకా ఈ విషయమై నిర్మాత దిల్ రాజు అఫీషియల్ గా ఏ ఎనౌన్స్ చేయకపోవడం డౌట్స్  రేకెత్తిస్తోంది. 

Vakeel Saab teaser not came for Deepavali? jsp

ఇప్పుడు అందరి దృష్టీ  ‘వకీల్ సాబ్‌’  సినిమాపై ఉంది. ఈ సినిమాకు సంభందించిన ప్రతీ అంశమూ హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ సినిమాకు సంభందించిన లీక్ లు పెద్ద స్దాయిలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో అఫీషియల్ గా ఈ చిత్రం టీమ్ నుంచి టీజర్ లేక ట్రైలర్ అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. నిజానికి దసరాకు వకీల్ సాబ్ టీజర్ వస్తుందని అంతా ఎక్సపెక్ట్ చేసారు. 

దాంతో ట్విట్టర్ లో “వకీల్ సాబ్ టీజర్ ఆన్ దసరా” అంటూ చాన్నాళ్లు ట్రెండింగ్ జరిగింది. అబ్బే అలాంటిదేమీ లేదని తేల్చేసాడు దిల్ రాజు. ఆ తర్వాత  దీపావళికి టీజర్ అంటూ ఫీలర్,వార్తలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ తో పాటు మీడియా మొత్తం వకీల్ సాబ్ టీజర్ దీపావళికి వస్తుందని ఫిక్స్ అయ్యి ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటిదాకా ఈ విషయమై నిర్మాత దిల్ రాజు అఫీషియల్ గా ఏ ఎనౌన్స్ చేయకపోవడం డౌట్స్  రేకెత్తిస్తోంది. 

వారంలో దీపావళి ఉంది. అంటే ఫ్యాన్స్ ప్రిపరేషన్ కోసం ఈరోజు లేదా రేపు టీజర్ పై యూనిట్ నుంచి అధికారికంగా ఎనౌన్స్మెంట్ రావాలి. ఫలానా రోజున టీజర్ రిలీజ్ అంటూ పోస్టర్ వదలాలి. కానీ ఎక్కడా చడీ చప్పుడూ లేదు..మీడియాకు ఉప్పందలేదు. దాంతో రకరకాల వార్తలు మీడియాలో మొదలయ్యాయి. అసలు అంతా అనుకున్నట్లు సంక్రాంతికి సినిమా రాదేమో.. అందుకే… దిల్ రాజు  సైలెంట్ అయ్యాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం నిజమా కాదా అనేది మరికొద్దిరోజుల్లో తేలిపోనుంది.

హిందీలో  బిగ్ బి అమితాబ్ చేసిన లాయర్ పాత్రను టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ పోషిస్తున్నారు. ఈ సినిమాకు వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అంతే కాకుండా పవన్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నివేదా థామస్, అనన్య నాగేళ్ల, అంజలి నటిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios