Asianet News TeluguAsianet News Telugu

ఉగాది రోజు “వకీల్ సాబ్” కలెక్షన్స్ పరిస్దితి ఏంటి!

 నిన్న ఉగాది రోజు శెలవు కావటం తో కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి ...పికప్ అయ్యాయా లేదా అన్నది అంతటా చర్చనీయాంశంగా మారింది. 

Vakeel Saab  stands super strong yesterday jsp
Author
Hyderabad, First Published Apr 14, 2021, 12:34 PM IST

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేసిన ‘వకీల్ సాబ్’ సినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించిన సంగతి తెలిసిందే. తొలిరోజు రూ.30 కోట్ల షేర్ మార్క్ టచ్ చేసిన ఈ సినిమా రెండవ రోజు, మూడవ రోజు కూడ మంచి రన్ అందుకుని రికార్డ్ లు క్రియేట్ చేసింది. టికెట్ ధరలు తగ్గించినా కూడ వీకెండ్ కావడంతో వసూళ్లు బాగానే ఉండటం కాస్త రిలీఫ్ ఇచ్చింది. దీంతో మూడు రోజులకు గాను ఏపీ, తెలంగాణల్లో కలిపి రూ.53.5 కోట్ల షేర్ ఖాతాలో వేసుకుంది సినిమా. 

ఇక నాల్గవ సోమవారం వర్కింగ్ డే కావడం, తగ్గిన టికెట్ ధరలు వెరసి వసూళ్ల మీద గట్టి ప్రభావమే పడింది.  చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ రన్ లభించినా భారీ కలెక్షన్స్ కనబడలేదు. నైజాంలో 1.12 కోట్లు, సీడెడ్లో 81 లక్షలు, ఉత్తరాంధ్రలో 96 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 31 లక్షలు, వెస్ట్ గోదావరిలో 22 లక్షలు, గుంటూరులో 32 లక్షలు, కృష్ణాలో 31 లక్షలు, నెల్లూరు 14 లక్షలు కలిపి మొత్తంగా 4.19 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 

ఈ నేపధ్యంలో నిన్న ఉగాది రోజు శెలవు కావటం తో కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి ...పికప్ అయ్యాయా లేదా అన్నది అంతటా చర్చనీయాంశంగా మారింది.  ఎన్ని అడ్డంకులు వచ్చినా  ‘వకీల్ సాబ్’  సినిమా హిట్ టాక్ రావటం, ముఖ్యంగా మహిళలకు బాగా నచ్చడంతో నిన్న పండుగ రోజు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్రలో దాదాపు అన్ని హౌస్ ఫుల్స్ అయ్యాయి. కలెక్షన్స్ కరెక్ట్ ఫిగర్ ఎంత అనేది తెలియరాలేదు.

కాకపోతే  ఫస్ట్ వీక్ టికెట్ హైక్ గనుక ఉండి ఉంటే ఈ వసూళ్లు మరింత మెరుగ్గా ఉండేవి. ఇక ఈరోజు అంబేడ్కర్ జయంతి పబ్లిక్ హాలిడే కావడం సినిమాకు ఊరటనిచ్చే విషయం. ఈ రెండు రోజుల్లో కనీసం 15 కోట్ల వరకు ఖాతాలో వేసుకోవచ్చు అని ట్రేడ్ లో లెక్కులు వేస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చాడు.మూడు సంవత్సరాల తర్వాత వెండితెరపై పవన్ ఈ మూవీతో ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. కలెక్షన్స్ పరంగా ఈ సినిమా రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. కేవలం  తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విడుదలైన ప్రతిచోటా ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ ఫ్యాన్స్ కు పండగ చేస్తోంది. ఈ నేపధ్యంలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉన్నా సరే.. ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది కొవిడ్‌ నిబంధనలు  కూడా పాటించడం లేదు. 

ఇక ఈ చిత్రం హిందీలో వచ్చిన ‘పింక్‌’ చిత్రానికి రీమేక్‌. మూల కథలో కొన్ని మార్పులు చేసి ‘వకీల్‌ సాబ్‌’ని తెరకెక్కించి హిట్ కొట్టారు. ఇందులో పవన్ కళ్యాణ్ కు పోటీగా ప్రకాశ్‌ రాజ్‌, శ్రుతి హాసన్‌, అంజలి, నివేదా థామస్‌, అనన్య కీలక పాత్రలు పోషించారు.  తమన్‌ సంగీతం అందించారు. హిందీ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios