పెద్ద సినిమాలకు లీక్ లు అనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. సినిమా షూటింగ్ లో ఉండగానే వీడియోలు, ఫొటోలు బయిటకు వచ్చేస్తున్నాయి. అభిమానులు తమ హీరో నటిస్తున్న సినిమాలో ఎలా ఉండబోతున్నాడో తెలుసుకునేందుకు చూపే ఉత్సాహమే దీనికి ఊతమిస్తోంది.  తాజాగా పవన్ కళ్యాణ్ చిత్రం  ‘వకీల్ సాబ్‌’ కోర్టు సీన్ వీడియో లీక్ అయినట్లు సమాచారం. హిందీలో  బిగ్ బి అమితాబ్ చేసిన లాయర్ పాత్రను టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ పోషిస్తున్నారు. ఇప్పుడా వకీల్ సాబ్ మూవీలో కోర్టు సీన్ వీడియో లీక్ కావడం చిత్ర యూనిట్‌ను ఇబ్బంది పెడుతోంది. కొన్ని నెలల కొందట సీన్ లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ లీకులు మూవీ యూనిట్‌ను అసహనానికి గురిచేస్తున్నాయి.

ఈ వీడియోలో పవన్ కళ్యాణ్, అంజలి ఉన్నారని, కోర్ట్ నేపధ్యంలో సీన్ జరుగుతుందని తెలుస్తోంది. వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇనిస్టగ్రమ్ లలో ఈ ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. మొదట లీకైన క్లిప్ లో పవన్ గడ్డంతో ఉండగా తాజాగా లీకైన క్లిప్ లో పవర్ స్టార్ క్లీన్ షేవ్ తో లాయర్ కోటు ధరించి ఉన్నాడు. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అభిమానుల్లో ఓ రేంజి క్రేజ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని కళ్లు మూసుకు చెప్పేయవచ్చు. హిట్,ప్లాఫ్ లకు సంభంధం లేకుండా ఆయన సినిమాలను అభిమానులు ఆదరిస్తూంటారు. ఆయన ఫ్యాన్స్ అశోశియోషన్ లో సభ్యులు రోజు రోజుకూ పెరగటమే కానీ తగ్గటం జరగదు.  ఆ క్రమంలో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా  ఈ సినిమాకు వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అంతే కాకుండా పవన్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నివేదా థామస్, అనన్య నాగేళ్ల, అంజలి నటిస్తున్నారు.