పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘వకీల్ సాబ్’ ( Vakeel Saab) మూవీలో కీలకపాత్రలో నటించిన అనన్య నాగళ్ల మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళంలోనూ ఈ బ్యూటీ ఎంట్రీ ఇవ్వనుంది.  

‘మల్లేశం’మూవీతో తనలోని నటనను బయటపెట్టింది అనన్య నాగళ్ల (Ananya Nagalla). ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులు పరిచయమైంది. అదేవిధంగా బెస్ట్ ఫీమేల్ డెబ్యూ ఫిల్మ్ సైమా అవార్డుకు కూడా నామినేట్ అయ్యింది అనన్య. ఆ తర్వాత ప్లే బ్యాక్ మూవీ, వకీల్ సాబ్ మూవీలో నటించిన తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. అటు సినిమాలతో పాటు, ఇటు సోషల్ మీడియాలో ను అనన్య రోజురోజుకూ తన క్రేజ్ పెంచుకుటోంది. గ్లామర్‌ డోస్.. హాట్‌నెస్‌ పెంచుతూ కుర్రాళ్లకి చుక్కలు చూపిస్తుంది. కంటి నిండ నిద్ర లేకుండా చేస్తుంది.

`మల్లేశం` చిత్రంలో ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించి మెప్పించిన అనన్య నాగళ్ల ఆ తర్వాత ట్రెండ్‌కి అలవాటు పడుతుంది. మారుతున్న కాలానికి అనుగునంగా మనం మారాలనే విషయాన్ని చాటుతుంది. సినీ రంగంలోకి రాణించాలంటే గ్లామర్‌ పోత తప్పదనే విషయాన్ని వంట బట్టించుకున్నట్టుంది అనన్య. అయితే అనన్యకు తమిళంలోనూ అవకాశాలు వస్తున్నాయి. తమిళ యాక్టర్, డైరెక్టర్ మహాలింగం శశికుమార్ (Mahalingam Sasikumar) తో కలిసి ఫీమేల్ లీడ్ రోల్ లో నటించనుంది. అయితే చిత్రంలో అనన్య నాగిళ్లతో పాటు మరో హీరోయిన్ కూడా నటించనుంది. 

Scroll to load tweet…

ఈ అప్ కమింగ్ ఫిల్మ్ లో శశికుమార్, అనన్య పాండే కలిసి నటించనున్నారు. ఈ చిత్రానికి తంగం ప శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్కేఎల్ ఎస్ గ్యాలక్సీ మాల్ ప్రోడక్షన్ ఆద్వర్యంలో నిర్మాత ఈ.మోహన్ నిర్మిస్తున్నారు. సామ్ సి. ఎస్ సంగీతం అందించనున్నారు. అయితే ఈ మూవీ టైమ్ ట్రావెల్ బేస్డ్ గా తెరకెక్కనుంది. తెలుగులో తన క్రేజ్ పెంచుకున్న అనన్య... ఈ మూవీతో తమిళ ప్రేక్షకులను కూడా పలకరించనుంది. మరోవైపు హీరోయిన్ ‘సమంత’ (Samantha) నటిస్తున్న ‘శాకుంతలం’ (Shakuntalam) మూవీలోనూ ఒక పాత్రను పోషించనుంది.