Asianet News TeluguAsianet News Telugu

రెమ్యునరేషన్ అడిగితే ముఖం చాటేస్తున్నారు.. 'వకీల్ సాబ్' నటి కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం గత ఏడాది విడుదలై తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ కి ఇది రీ ఎంట్రీ చిత్రం.

Vakeel Saab actress Lirisha sensational comments on remuneration
Author
First Published Nov 14, 2022, 5:23 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం గత ఏడాది విడుదలై తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ కి ఇది రీ ఎంట్రీ చిత్రం. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నివేతా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో నటించారు. 

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కోర్టు సన్నివేశాల్లో అదరగొట్టేశారు. సూపర్ వుమెన్ సూపర్ వుమెన్ అంటూ పవన్ జోకులు పేల్చిన సీన్ విశేషంగా ఆకట్టుకుంది. ఆ సన్నివేశంలో నటి నటించారు. ఈ చిత్రంలో లిరీషా పోలీస్ అధికారిగా నటించింది. పవన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక లిరీషా నీళ్లు నమలడం ఆకట్టుకుంటుంది. 

తాజాగా ఇంటర్వ్యూలో లిరీషా తన రెమ్యునరేషన్ కష్టాలు వివరించింది. పలు చిత్రాల్లో లిరీషా నటించింది. అలాగే టీవీ సీరియల్స్ లో కూడా నెగిటివ్ రోల్స్ ప్లే చేసింది. ఇటీవల తెప్ప సముద్రం అనే చిత్రంలో నటించాను. కానీ ఇంకా రెమ్యునరేషన్ ఇవ్వలేదు. అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారు. నిర్మాతకు ఫోన్ చేస్తే అసలు స్పందించడం లేదు. 

అలాగే వరుడు చిత్రం కోసం 40 రోజులు షూటింగ్ చేశా. కానీ సగం పేమెంట్ మాత్రమే ఇచ్చారు. ఫైనల్ కట్ లో అక్కడక్కడా సీన్స్ చూపించారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. రెమ్యునరేషన్ విషయంలో తన లాంటి నటీమణులకు అన్యాయం తప్పడం లేదు అని లిరీషా వాపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios