శ్రీరెడ్డి దెబ్బకి వాకాడ అప్పారావు అవుట్...చిరు సీరియస్

First Published 15, Apr 2018, 3:18 PM IST
Vakada apparao walked out from konidela productions
Highlights

శ్రీరెడ్డి దెబ్బకి వాకాడ అప్పారావు అవుట్...చిరు సీరియస్

నటి శ్రీరెడ్డి దెబ్బ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావుపై తీవ్రంగా పడింది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ అనేకమంది యువతులను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న వాకాడ ‘ నిజ స్వరూపాన్ని ‘ శ్రీరెడ్డి బయటపెట్టిన సంగతి తెలిసిందే. ‘ చిరంజీవి గారూ ! మీ ప్రొడక్షన్ హౌస్ లో పని చేసే వాకాడ అప్పారావు గారి విషయం కాస్త పట్టించుకొంటారా ? అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకునే అతని నిజ స్వరూపం ఇదే ‘ అంటూ శ్రీరెడ్డి తన ట్వీట్స్ లో ‘ బాంబు ‘ పేల్చింది.

కొణిదెల ప్రొడక్షన్స్ నుంచి వాకాడ ఔట్ ! మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘ ఖైదీ నెం.150 ‘ చిత్రంలో అవకాశాలు ఇప్పిస్తానని, అయితే ఇందుకు తనతో ‘ సహకరించాలని ‘ పలువురు జూనియర్ ఆర్టిస్టు లను వాకాడ ప్రలోభపెట్టాడని ఆ మధ్య ఆరోపణలు వచ్చాయి. వీటిని ఆయన ఖండించినప్పటికీ.. ఈ ఆరోపణల విషయాన్ని తమ సంస్థ సీరియస్ గా పరిగణించిందని కొణిదెల ప్రొడక్షన్స్ సీఈవో తెలిపారు. ఈ అంశాన్ని ‘మా ‘ లోని ‘ క్యాష్ కమిటీ ‘ కి నివేదించామన్నారు. విచారణ తరువాత వాకాడపై చర్య తీసుకుంటామన్నారు. కాగా.. ఇదే విషయాన్ని వాకాడ ధృవీకరిస్తూ.. ఈ కంపెనీ నుంచి తాను వైదొలగినట్టు చెప్పాడు. చిరంజీవి కూడా విషయం తెలుకొని సీరియస్ అయినట్టు సమాచారం.

loader