Asianet News TeluguAsianet News Telugu

'వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర గోవింద‌` మూవీ రివ్యూ

చక్కగా నవ్విస్తూ హాస్య నటుడుగా వెలిగిపోతున్నవాళ్లు ఓ రోజు  హఠాత్తుగా ఆలోచనలో పడి... ఒకప్పుడు మనం జోక్ చెప్తే మనం ఇచ్చే డబ్బుతో టీ తాగే వాడు కూడా నవ్వేవాడు కాదు..అలాంటిది..మనం తెరమీద కనపడితే  ఏం చెయ్యకపోయినా ...చేసేస్తామేమో అని నవ్వేస్తున్నారు. 

Vajra Kavachadhara Govinda Movie Review & Rating
Author
Hyderabad, First Published Jun 15, 2019, 4:18 PM IST

 

---సూర్య ప్రకాష్ జోశ్యుల
 

చక్కగా నవ్విస్తూ హాస్య నటుడుగా వెలిగిపోతున్నవాళ్లు ఓ రోజు  హఠాత్తుగా ఆలోచనలో పడి... ఒకప్పుడు మనం జోక్ చెప్తే మనం ఇచ్చే డబ్బుతో టీ తాగే వాడు కూడా నవ్వేవాడు కాదు..అలాంటిది..మనం తెరమీద కనపడితే  ఏం చెయ్యకపోయినా ...చేసేస్తామేమో అని నవ్వేస్తున్నారు. మన కోసం ఎదురుచూస్తున్నారు...ఆ మధ్యన ఓ థియోటర్ దగ్గర బ్యానర్స్ గట్రా కూడా కట్టారు. ఫ్యాన్స్ ఆటోగ్రాఫ్ లు తీసుకుంటున్నారు. మీడియా వాళ్లు ఇంటర్వూకు వస్తున్నారు. అంతేనా..కొన్ని సినిమాల్లో మన అసలు హీరోకన్నా మన కామెడీనే బాగుందని వాటి కోసం జనం చూసారని రివ్యూలు గట్రాకూడా వచ్చాయి....మనకింత క్రేజ్ వచ్చింది కదా  హీరో ఎందుకు అయిపోకూడదనిపిస్తుంది. మనలో మన మాట...హీరోకు, మనకు తేడా ఏముంది అని మనస్సు గట్టిగా ప్రశ్నిస్తుంది. 

అయినా హీరోకి లేనిది నీకో ఫెసిలిటీ ఉంది, అది నువ్వు క్లిక్ అవ్వకపోతే మళ్లీ వెనక్కి వెళ్లి చక్కగా కామెడీ వేషాలు వేసుకోవచ్చు అనే ధైర్యం ప్రెండ్స్ ఆల్రెడీ ఇచ్చేస్తారు ...అవన్నీ కలిసి ఓవర్ నైట్ లో దాడి మనస్సుపై దాడి చేసి ఓవర్ నైట్ లో మేకప్ మార్చేసి... హీరోని చేసేస్తాయి. అది కూడా సర్వర్ సుందరం,యమలాంటి లాంటి కామెడీ హీరో కాదు...ఎగిరి కొడితే ఇరవై మంది క్రింద పడే ఫైట్స్, వీణ స్టెప్స్ కూడా అలవోకగా వేసి పారేసే పాటలు, పంచ్  డైలాగులు చెప్పే చెప్పే మాస్ హీరో ఏసం. అయ్యో....మేము  చెప్తున్నది సునీల్ గురించి కాదు...సప్తగిరి గురించి. ఎందుకంటే సునీల్ ప్రారంభంలో అందాల రాముడు, మర్యాద రామన్న, పూల రంగడు వంటి హిట్స్ ఇచ్చాడు. కానీ సప్తగిరి హీరోగా ఇంకా గుర్తింపే తెచ్చుకోలేదు. కామెడీ ముసుగులో మాస్ హీరోగా ఆవిర్బించే  సన్నాహాల్లో ఉన్నాడు. అందులో భాగంగా చేసిన సినిమానే ఇది. ఈ సినిమా ఎలా ఉందో..చూడచ్చా లేదో చూద్దాం.  


కథేంటి..?

మంచి దొంగ గోవింద్ (సప్తగిరి)ది యధావిధిగా మంచి మనస్సు. రాబిన్ హుడ్ లా రెచ్చిపోవాలనిపించే ఆలోచనలు. అలాంటి మనస్సుకు తన ఊళ్లో జనాలు కాన్సర్ తో బాధపడటం కనపడి కలిచి వేస్తుంది. వెంటనే వాళ్ల కోసం ఏదో ఒకటి చేసేయాలనిపిస్తుంది. అందుకు ఓ ఇరవై కోట్లు అయినా అవసరం పడతాయి. మామూలు మనిషి కు అయితే ఇరవై కోట్లు అనే ఆలోచన మతి పోయాలే చేస్తుంది కానీ గోవింద్ కు ఇలాంటివన్నీ హుష్ కాకి. వెంటనే  మహేంద్ర నీలం వజ్రం (నీలం రంగు వేసిన రాయి పెట్టారు లెండి) దొంగతనం ప్లాన్ చేస్తాడు. నూట యాభై  కోట్లు ఉన్న ఆ వజ్రం  పట్టుకొస్తే కాన్సర్ కష్టాలు తీరుతాయి..టైటిల్ జస్టిఫికేషన్ జరుగుతుంది అని డిసైడ్ అవుతాడు. 

 ఆ వజ్రం లేపేయటం కోసం ఓ స్వామీజీ అవతారం ఎత్తుతాడు. రకరకాల ఎత్తులు వేసి  వజ్రం కొట్టేస్తాడు. ఇక అమ్మేస్తాడు, జనం కష్టాలు తీర్చేస్తాడు..సినిమా అవకొట్టి మన కష్టం తీరుస్తాడు అనకున్న టైమ్ లో ఓ ట్విస్ట్ పడుతుంది.   గోవింద్ కు మైండ్ దొబ్బుద్ది. (మనకు కాదు ..దొంగకే). వజ్రాన్ని ఎవరికీ దొరక్కుండా దాచిపెట్టిన గోవింద్‌ ఓ ప్రమాదంలో గతం మర్చిపోతాడు. వజ్రాన్ని దాచిన చోటు కూడా మర్చిపోతాడు. దాంతో ఆ వజ్రం ఎక్కడ దాచాడో మర్చిపోతాడు. ఇంతకీ ఆ దొంగకు తిరిగి జ్ఞాపక శక్తి వస్తుందా...సినిమా చివరకు ఏమౌతుంది, ఇంతకీ ఈ కథలో విలన్  బంగారప్ప, హీరోయిన్ పాత్రలు ఎక్కడ ఇరికించారు వంటి విషయాలపై ఆసక్తి ఉంటే థియోటర్ కు వెళ్లి చూడవచ్చు.
 
ఏముందయ్యా సినిమాలో అంటే...?

ఇంతకీ ఈ సినిమాలో ఏముందై పై కథ చదివిన మీరు ఈ పాటికి చక్కగా ఊహించే ఉంటారు. ఏమీ లేదని అర్దం చేసుకుంటారు. దర్శకుడు సినిమా గురించి తెలియని రోజుల్లో ఇండస్ట్రీకు బయిలుదేరినప్పుడు రాసుకున్న కథని తీసి ఇప్పుడు వడ్డించాడని అర్దం చేసుకుంటాం. అయితే ఇలాంటి కథని సప్తగిరి ఓకే చేయటానికి కారణం ఏమిటా అని తలపట్టుకుంటాం. అయితే అతను కేవలం కథ చూడలేదని అందులోని ఆత్మ అయిన మాస్ మెలికలు చూసి, వాటికి పడిపోయాడని అర్దం చేసుకుంటాం. ఓ ప్రక్క తన తోటి కమిడయన్ ప్రియదర్శి మల్లేశం అంటూ సినిమా చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తూంటే తాను మాత్రం అలీ సినిమాలు చేసే కాలం నాటి కథ దగ్గరే ఆగిపోయి,సునీల్ బాటలో వెళ్లటం ఆశ్చర్యం, బాధ కలుగుతుంది. 
 
టెక్నికల్ గా...
 ఈ సినిమాకు ప్లస్ ఉన్నంతలో సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది. సంగీతం, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు గొప్పగా లేవు. 
ఈ సినిమా ఏ స్టాండర్డ్స్ లో ఉందనేందుకు ఒకే ఒక ఉదాహరణ చెప్పచ్చు. సినిమా మొత్తానికి కీలకంగా నిలిచే వజ్రం...ఓ రాయికు రంగేసినట్లు ఉంటుంది. ఎక్కడా ఆ మెరుపు కనపడదు. రెండు వందల కోట్ల విలువ చేసే వజ్రం అని చెప్పబడే అది ఇరవై రూపాయల విలువ కూడా చెయ్యదనిపిస్తుంది. అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. 

ఫైనల్ థాట్

బాబూ..సప్తగిరి..నీ సినిమా అంటే మేము కాస్సేపు నవ్వుకుందామనే వెళ్తాం. మాస్ సినిమాలు చేయటానికి చాలా మంది హీరోలు ఉన్నారు.
-----

Rating: 1.5/5

ఎవరెవరు

నటీనటులు :  స‌ప్త‌గిరి, వైభ‌వి జోషి, అర్చ‌న శాస్త్రి, టెంప‌ర్ వంశీ, జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ అవినాష్‌, అప్పారావు త‌దిత‌రులు
సంగీతం : బుల్గానియన్
స్టోరీ: జీటీఆర్ మ‌హేంద్ర‌
కెమెరా: ప‌్ర‌వీణ్ వ‌న‌మాలి
ఎడిట‌ర్‌: కిశోర్ మ‌ద్దాలి
నిర్మాత : నరేంద్ర, జీవిఎన్ రెడ్డి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : అరుణ్ పవర్
బ్యానర్‌: శివ శివమ్‌ ఫిల్మ్స్‌
విడుదల తేదీ: 14-06-2019

Follow Us:
Download App:
  • android
  • ios