MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • TV
  • Brahmamudi Serial Today Episode: పెద్ద స్కాం చేసేందుకు రాజ్ ప్లాన్, సుభాష్‍ను చంపేందుకు రేఖ కుట్ర‍!

Brahmamudi Serial Today Episode: పెద్ద స్కాం చేసేందుకు రాజ్ ప్లాన్, సుభాష్‍ను చంపేందుకు రేఖ కుట్ర‍!

Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. పెద్ద స్కాం చేసేందుకు రాజ్ ప్లాన్ వేేస్తాడు, సుభాష్‍ను చంపేందుకు డాక్టర్ చేత ఇంజక్షన్ వేయిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో చూసేద్దాం. 

3 Min read
Author : Nandini Arava
Published : Mar 20 2026, 10:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
లాయర్‍ను కలిసిన అపర్ణ
Image Credit : jio hotstar

లాయర్‍ను కలిసిన అపర్ణ

పవర్ ఆఫ్ అటార్నీ ఇందు పేరుపై మార్చడానికి లాయర్‍ను అపర్ణ గుడి దగ్గర కలిసింది. నా పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ మొత్తం నా నుంచి రేఖ బలవంతంగా లాక్కుంది. ఇది చాలా పెద్ద తప్పు కాబట్టి, కోర్టుకు వెళ్తే మీకే న్యాయం చేస్తుందని లాయర్ చెప్తాడు. వాళ్లు వాడుకున్న మొత్తం డబ్బును కోర్టు మీకు అందేలా చేస్తుందని చెబుతాడు. నాకు డబ్బు వద్దు, గెలుపోటములు కాకుండా న్యాయం జరిగేలా చూడాలని లాయర్‍ను వేడుకుంటుంది. కోర్టులో కేసు గెలిచేవరకూ ఈ విషయం బయటకు రాకూడదని చెప్తుంది. కేసు పూర్తయ్యే వరకూ బయటపెట్టనని లాయర్ చెప్తాడు. రేఖ నా చేత బలవంతంగా సంతకం చేయించుకున్న డాక్యుమెంట్స్ ను లాయర్‍కు అపర్ణ ఇస్తుంది. ఫీజు ఇచ్చే పరిస్థితుల్లోలేనని బంగారు గాజులను ఫీజుగా ఇస్తుంది అపర్ణ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
లేటుగా వెళ్లడం వల్ల జాబ్ పోగొట్టుకున్న ఇందు
Image Credit : jio hotstar

లేటుగా వెళ్లడం వల్ల జాబ్ పోగొట్టుకున్న ఇందు

ఇంటర్య్వూకు వస్తుంది ఇందు. ఎదురుగా ఆఫీస్ బాయ్ కనపడేసరికి...నేను ఇంటర్వ్యూకు వచ్చానని చెప్పింది. ఇంటర్య్వూ అయిపోయింది అని ఆఫీస్ బాయ్ చెప్తాడు. హెచ్ ఆర్‍తో నేను కలిసి మాట్లాడుకుంటాను అని అంటుంది. హెచ్ ఆర్ రూం చూపించి వెళ్లమంటాడు. కానీ నేను చెప్పినట్లు కాకుండా మీరే వచ్చినట్లు చెప్పమని ఆఫీస్ బాయ్ చెప్తాడు. అప్పటికే హెచ్ ఆర్ ఎవరితోనో ఫోన్‍లో మాట్లాడుతుంటాడు. ఇంటర్య్వూ కోసం వచ్చానని చెప్తుంది. టైం అయిపోయింది, ఇక నువ్వు వెళ్లిపోవచ్చు అని చెప్తాడు. రోడ్డు మీద జరిగిన విషయం గురించి ఇందు చెప్తుంది. లేటుగా వచ్చినవాళ్లంతా ఇలాంటి రీజన్స్ చెప్తారు...ఇంటర్వ్యూకు లేటుగా వచ్చినదానివి, జాబ్ వచ్చాక టైంకు పనిచేస్తావని గ్యారంటీ ఏంటని ప్రశ్నిస్తాడు. కారణాలు చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చని అంటాడు.

Related Articles

Related image1
Brahmamudi Serial Today Episode: పవర్ ఆఫ్ అటార్ని నుంచి రేఖను తప్పించాలని అపర్ణ ప్లాన్, ఇందు ఫోన్ పగలగొట్టిన రాజు
Related image2
Brahmamudi Serial Today Episode: బైక్ కోసం తమ్ముడిని ఇరికేంచేసిన రాజు, ఇందును అవమానించిన ఐశ్వర్య
37
ల్యాప్‍టాప్ డీల్ కుదుర్చుకున్న రాజ్, లక్కీ
Image Credit : jio hotstar

ల్యాప్‍టాప్ డీల్ కుదుర్చుకున్న రాజ్, లక్కీ

ఇక మరోవైపు రాజు, లక్కీ...డీల్ కోసం మాట్లాడుతుంటారు. మీరు పనిచేయని ల్యాప్‍టాప్ రూ.50వేలకు అమ్మావని లక్కీ చెప్పాడు, అందుకే మీ దగ్గరికి వచ్చామని చెప్తాడు. అతను సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నానని, అక్కడ ల్యాప్‍టాప్‍లు సర్వీస్ చేస్తున్నానని, ఇప్పుడు అక్కడ కొన్ని ల్యాప్‍టాప్‍లు పాడయ్యాయని స్క్రాప్‍లో కొంటే... ఇప్పుడు అవి పనిచేయడం లేదని డీల్ తెచ్చిన వ్యక్తి చెప్తాడు. ఇప్పుడా ల్యాప్‍టాప్‍లు మీరు తీసుకోండని చెప్తాడు. తెచ్చిన ల్యాప్‍టాప్ రాజ్‍కు చూపిస్తాడు అతను. ఒకేసారి రేపు తీసుకొస్తే అమ్ముదామని డీల్ కుదుర్చుకుంటారు. 

47
స్కాం చేయాలని రాజ్ ప్లాన్
Image Credit : jio hotstar

స్కాం చేయాలని రాజ్ ప్లాన్

ఈ ల్యాప్‍టాప్‍లతో నువ్వేం చేస్తావని లక్కీ అడిగితే...దానికో స్కెచ్ వేసా అని రాజ్ చెప్తాడు. 25 ల్యాప్‍టాప్‍లు ఎలా అమ్ముతావని, ఒక్కొక్కటి అమ్మినా 5 రోజులు పడుతుందని లక్కీ అంటాడు. ల్యాప్‍టాప్‍లు అమ్మాలంటే చీట్ చేస్తే సరిపోదు, స్కాం చేయాలని రాజ్ అంటాడు. ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించాలని అందరూ అనుకుంటారు. అలాంటివాళ్లే టార్గెట్, ఇంట్లోనే ఉంటూ నెలకు రూ.50వేలు సంపాదించే సువర్ణ అవకాశం అని సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడతామని రాజ్ అంటాడు. నెలకు రూ.50వేలు ఎలా ఇస్తావ్‍రా లక్కీ అడిగితే...అంటాం గానీ ఇవ్వం, ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.20 వేలు కట్టాలని చెప్తాం, అంటే మొత్తం రూ.5 లక్షలు వస్తాయని రాజ్ చెప్తాడు. అలా మోసం చేయడానికి ప్లాన్ చేస్తారు.

57
డాక్టర్‍ను పిలిపించిన రేఖ
Image Credit : jio hotstar

డాక్టర్‍ను పిలిపించిన రేఖ

ఇక అటు ఇందు, ఇటు అపర్ణ వేర్వేరు ఆటోల్లో ఇంటి దగ్గర దిగుతారు. ఎక్కడికివెళ్లావ్ నాన్నమ్మ అని అడిగితే...గుడికి వెళ్లానని చెప్తుంది. నీ జాబ్ ఏమైందని అంటే...ఒకడి వల్ల జాబ్ పోయిందని చెప్తుంది.ఇంతలో సుభాష్ రూం నుంచి నుంచి డాక్టర్ బయటకు వస్తాడు. తాతయ్యకు ఏమైందని రేఖను అడిగితే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందని డాక్టర్‍ను పిలిపించందని చెప్తుంది. 

67
సుభాష్‍కు స్ట్రోక్
Image Credit : jio hotstar

సుభాష్‍కు స్ట్రోక్

 కంగారు పడి అపర్ణ, ఇందు ఏమైందని సుభాష్‍ను అడిగితే...తనకేం జరగలేదని చెప్తాడు. రేఖ డాక్టర్‍ను తెచ్చిన మాట నిజమే గానీ..బ్రీతింగ్ ప్రాబ్లమ్ కాదని... బీపీ, షుగర్ కంట్రోల్‍లో ఉందో లేదో చూపించి విటమిన్ D తక్కువగా ఉందని ఇంజక్షన్ వేసి వెళ్లిపోయాడని చెప్తాడు. సడెన్‍గా రేఖ ఇంత జాగ్రత్త ఎందుకు తీసుకుందని అనుకుంటుంది అపర్ణ. వాళ్లని చూస్తే పడని నువ్వు ముసలాడి కోసం డాక్టర్‍ను ఎలా పిలపించావ్ అని భ్రమరాంబ రేఖను అడుగుతుంది. ఇంకో 5 సెకన్లలో నీకే అర్థమవుతుందని చెప్తుంది. ఇంతలో సుభాష్‍కు స్ట్రోక్ లాగా వచ్చేస్తుంది.

77
హాస్పిటల్‍కు తీసుకెళ్లాలని రేఖను ప్రాధేయపడ్డ అపర్ణ, ఇందు
Image Credit : jio hotstar

హాస్పిటల్‍కు తీసుకెళ్లాలని రేఖను ప్రాధేయపడ్డ అపర్ణ, ఇందు

అపర్ణ, ఇందు కంగారు పడతారు. హాస్పిటల్‍కు తీసుకెళ్లాలని అపర్ణ, ఇందు రేఖను అడుగుతారు. ఇప్పుడే డాక్టర్‍ వెళ్లిపోయాడు, మళ్లీ పిలవాలంటే అతనికి ఇబ్బంది అంటుంది. అతనికి ఇంత ఇబ్బంది పడుతుంటే...డాక్టర్‍ వెళ్లిపోయాడంటావేంటీ అంటుంది అపర్ణ. సరే నీ వల్ల కాకపోతే మేమే డాక్టర్‍ దగ్గరికి తీసుకెళ్తామని చెప్తుంది. హాస్పిటల్‍కు తీసుకెల్తే ఏమని చెప్తావ్ అని రేఖ అంటే..నువ్వే ఏదో ఇంజక్షన్ వేయించావని చెప్తా అంటుంది అపర్ణ. నేను దానికి యాంటీ డోస్ చెప్పకపోతే డాక్టర్లు కూడా ఏం చేయలేరని చెప్తుంది రేఖ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
Brahmamudi Serial Today Episode: పవర్ ఆఫ్ అటార్ని నుంచి రేఖను తప్పించాలని అపర్ణ ప్లాన్, ఇందు ఫోన్ పగలగొట్టిన రాజు
Recommended image2
Brahmamudi Serial Today Episode: బైక్ కోసం తమ్ముడిని ఇరికేంచేసిన రాజు, ఇందును అవమానించిన ఐశ్వర్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved