సినిమా పరమ రొటీన్ గా ఉండటంతో దెబ్బతింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ఎంత పెట్టారు.ఎంత నష్టపోతారనే లెక్కలు ట్రేడ్ లో మొదలయ్యాయి.


మొదటి సినిమా ‘ఉప్పెన’తో అందరినీ సూపర్ గా చేసాడురా అనిపించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసు. అందరూ మొదటి సినిమాకు ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్, పాత్ర ఎంచుకోవడం పెద్ద సాహసమని మెచ్చుకున్నారు. ఆ ఉత్సాహానికి తగ్గట్లే రెండో సినిమాగా ‘కొండపొలం’ లాంటి మరో ప్రయోగాత్మక కథలో నటించాడు. ఇప్పుడతను ‘రంగ రంగ వైభవంగా’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

అయితే రెండు సినిమాలు డిఫరెంట్ గా వెళ్లాను కదా..మూడో సినిమా రొటీన్ గా వెళ్దామనుకున్నాడేమో...పరమ ఫార్ములా కథతో మనలని పలకరించాడు. ఫార్ములా కథలు ఆడే రోజులు వెళ్లిపోయాయి. ఇప్పుడు కథలోనో, స్క్రీన్ ప్లేలోనో, సీన్స్ లోనో,నటనలోనో ఎక్కడో చూడా డిఫరెంట్ ఉండాలి. అప్పుడే ఉప్పెన లా ఉర్రూతలూగించగలుగుతాము. అయితే ఈ సారి అలా జరగలేదు. సినిమా పరమ రొటీన్ గా ఉండటంతో దెబ్బతింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ఎంత పెట్టారు.ఎంత నష్టపోతారనే లెక్కలు ట్రేడ్ లో మొదలయ్యాయి.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా మీద పెట్టిన ఖర్చు, ఫైనాన్సియర్స్ వడ్డీలు, పబ్లిసిటీ అంతా కలిపి రంగ రంగ వైభవంగా సినిమాకు 28, 30 కోట్లు దాకా ఖర్చయిందని తెలుస్తోంది. థియోటర్ బిజినెస్ 11 కోట్లు దాకా అయ్యిందంటున్నారు. ఇప్పటిదాకా కేవలం గ్రాస్ 3 కోట్లు మాత్రమే వసూలు అయ్యింది. సినిమా పూర్తి డ్రాప్ నడుస్తోంది. మిగతా రికవరీ కష్టం అంటున్నారు.

దాంతో ఖచ్చితంగా రికవరీ సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది. నైజాం సొంత రిలీజ్ చేసుకున్నారు. అయితే నాన్ థియేటర్ ఆదాయం 21 కోట్లు వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అందులో నిజమెంత అనేది తెలియదు. ఏదైమైనా ఈ సినిమా నిర్మాతకు భారీ నష్టమే అని చెప్తున్నారు.